ఏపీ కాకినాడలో ఏఈ నూకరాజు కుటుంబం ఆత్మహత్య కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సాదిక్‌ఖాన్‌ను మూడు రోజుల పాటు పోలీసుల కస్టడీకి అప్పగిస్తూ స్పెషల్ మొబైల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
మంగళవారం ఉదయం 10.30 గంటల నుంచి ఈ నెల 11వ తేదీ ఉదయం 10.30 గంటల వరకు సాదిక్‌ఖాన్ పోలీసుల కస్టడీలో ఉండనున్నారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని సర్పవరం పోలీసులకు అప్పగించనున్నారు.
కస్టడీ సమయంలో కేసుకు సంబంధించిన కీలక అంశాలపై పోలీసులు సాదిక్‌ఖాన్‌ను ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. కుటుంబం ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు, కేసుతో సంబంధం ఉన్న ఇతర అంశాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పోలీసుల విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
also read: కాన్పూర్‌లో దారుణం.. అనుమానంతో భార్యను ఐరన్ రాడ్‌తో హత్య చేసిన భర్త
