Homeక్రైమ్మైనర్ బాలికపై అత్యాచార యత్నం.. యువకుడిని పట్టుకున్న స్థానికులు

మైనర్ బాలికపై అత్యాచార యత్నం.. యువకుడిని పట్టుకున్న స్థానికులు

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మైనర్ బాలికపై అత్యాచారానికి యత్నించిన ఘటన కలకలం రేపింది. స్థానికంగా అందిన సమాచారం ప్రకారం.. ఓ యువకుడు బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను నిర్మానుష్య ప్రాంతంలోని ముళ్ల పొదల వైపు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

అక్కడ బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించగా.. ఆమె అప్రమత్తమై గట్టిగా కేకలు వేసింది. బాలిక అరుపులు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని యువకుడిని పట్టుకున్నారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.

ఈ ఘటనపై బాలిక కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు ఆళ్లగడ్డ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెలుగులోకి రావాల్సి ఉంది.

also read: రన్నింగ్ చేస్తూ కుప్పకూలిన 14 ఏళ్ల విద్యార్థి.. గురుకులంలో విషాదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు