ఖమ్మం జిల్లాలోని రఘునాథపాలెం బీసీ గురుకుల పాఠశాలలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల సాత్విక్ బుధవారం ఉదయం రన్నింగ్ చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు.
వెంటనే అప్రమత్తమైన తోటి విద్యార్థులు, ఉపాధ్యాయులు బాలుడిని ఖమ్మం సర్వజన ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రికి చేరుకునే సమయానికే సాత్విక్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
రన్నింగ్ చేస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలడంతో గుండెపోటు కారణంగా మృతి చెంది ఉండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. అయితే బాలుడి మృతిపై కుటుంబ సభ్యులు, బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
also read: ప్రేమించిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంటోందని యువకుడి ఆత్మహత్య
