గత కొన్ని రోజులుగా తనకు బెదిరింపు మెసేజ్‌లు వస్తున్నాయని జనసేన నేత, నటుడు తనీష్ బహిరంగంగా వెల్లడించారు. ‘సీతక్క గురించి మాట్లాడేంత పెద్దోడివా?’ అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో అసభ్యకర పదజాలంతో దూషిస్తున్నారని, ఆ మెసేజ్‌ల స్క్రీన్‌షాట్‌లను ఆయన ‘X’ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు.ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. “జనసేన జెండా పట్టుకున్నప్పుడే నేను ఎలాంటి పోరాటానికైనా, యుద్ధానికైనా సిద్ధమయ్యాను. ఒక ఆదివాసీ ఆడబిడ్డకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే నేను ధైర్యంగా ముందుకు వచ్చాను. నా పోరాటం కేవలం ఒక అంశానికే పరిమితం కాదు” అని స్పష్టం చేశారు.
నాని ‘ప్యారడైజ్’ రిలీజ్ సస్పెన్స్: సెప్టెంబర్ 24 టార్గెట్‌తో మేకర్స్ పరుగు!
ఇలాంటి బెదిరింపులకు వెనకడుగు వేసేది లేదని, తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటే సహించేది లేదని హెచ్చరించారు. ఈ అంశాన్ని పర్సనల్‌గా తీసుకెళ్తే.. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక మాఫియా నుంచి కమిషన్ కాంట్రాక్ట్ దందాల వరకు ప్రతీ ఒక్క విషయంపైనా ఆధారాలతో సహా మాట్లాడతానని తనీష్ గట్టిగా హెచ్చరించారు. న్యాయం కోసం ఎంతటి ప్రతిఘటన ఎదురైనా తన పోరాటం ఆపేది లేదని ఆయన తేల్చిచెప్పారు.
భారీగా పెరుగుతున్న ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల జోరు: పెట్రోల్ సేల్స్‌ను దాటేసిన CNG, EVలు!
