యువతను టార్గెట్ చేస్తూ తెరకెక్కిన మరో రొమాంటిక్ డ్రామా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే ఈ సినిమాను కేవలం పెద్దలకు మాత్రమే వీక్షించే అవకాశం ఉంటుంది.
యూత్‌ఫుల్ ఎమోషన్స్, ప్రేమ, సంబంధాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందినట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జోడీకి కూడా ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండటంతో మూవీపై అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఈ సినిమాకు మరో ప్రత్యేకత ఉంది. ‘90s – ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’ వెబ్‌సిరీస్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదిత్య హాసన్.. ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’తో దర్శకుడిగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. దీంతో ఆయన సినిమాను ఎలా తెరకెక్కించారనే అంశంపై కూడా ఆసక్తి నెలకొంది.
సెన్సార్ ప్రక్రియ పూర్తవడంతో విడుదలకు లైన్ క్లియర్ అయింది. ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ సెప్టెంబర్ 11న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యువతకు కనెక్ట్ అయ్యే కథ, ప్రేమకు సంబంధించిన భావోద్వేగాలు, నటీనటుల పెర్ఫార్మెన్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయా? అనేది విడుదల తర్వాత తెలియనుంది.
also read: పంట బోదెలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం.. పామర్రులో కలకలం
