Homeతెలంగాణఅసెంబ్లీ ఆవరణలో కుప్పకూలిన వ్యక్తి...  సీపీఆర్‌ చేసిన మంత్రి శ్రీహరి  

అసెంబ్లీ ఆవరణలో కుప్పకూలిన వ్యక్తి…  సీపీఆర్‌ చేసిన మంత్రి శ్రీహరి  

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నవీన్‌ మిట్టల్‌ పీఎస్‌ రాజు అనే వ్యక్తి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ ఘటనను గమనించిన మంత్రి వాకిటి శ్రీహరి వెంటనే స్పందించి మానవత్వాన్ని చాటుకున్నారు.

రాజు కిందపడిపోవడంతో మంత్రి శ్రీహరి దగ్గరకు వెళ్లి అత్యవసరంగా సీపీఆర్‌ చేశారు. పరిస్థితిని గమనించిన ఆయన వెంటనే వైద్య సిబ్బందిని అక్కడికి రప్పించి, అవసరమైన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. అనంతరం అంబులెన్స్‌ను పిలిపించి రాజును ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు.

అత్యవసర సమయంలో మంత్రి శ్రీహరి వెంటనే స్పందించి సహాయం చేయడం అక్కడున్న వారి దృష్టిని ఆకర్షించింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆపదలో ఉన్న వ్యక్తికి సకాలంలో స్పందించి సాయం చేసిన మంత్రిని పలువురు నెటిజన్లు అభినందిస్తున్నారు.

also read: విజయ్‌కు తండ్రి బాసట.. ‘నా కొడుకును చూసి గర్విస్తున్నా’ అంటూ ఎస్‌.ఏ. చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు