అస్సాం రాజధాని గౌహతి సమీపంలో దారుణ హత్య ఘటన వెలుగులోకి వచ్చింది. ఆరు నెలల క్రితమే వివాహమైన 25 ఏళ్ల రియా తలుక్దార్‌ను ఆమె భర్త రామానుజన్ గోస్వామి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతటితో ఆగకుండా మృతదేహం నుంచి తలను వేరు చేసి ఫ్రిడ్జ్‌లో దాచినట్లు వెల్లడైంది.
ఇంట్లో నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటిని తనిఖీ చేయగా.. ప్లాస్టిక్ బ్యాగ్‌లో తలలేని మహిళ మృతదేహం కనిపించింది. అనంతరం ఫ్రిడ్జ్‌ను పరిశీలించగా అందులో మృతురాలి తల లభించినట్లు పోలీసులు వెల్లడించారు.
శవం పక్కనే భోజనం చేశాడు
విచారణలో నిందితుడు సంచలన విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. భార్యను హత్య చేసిన అనంతరం ఆమె మృతదేహం పక్కనే కూర్చొని భోజనం చేసినట్లు అతడు చెప్పినట్లు సమాచారం. అయితే ఈ దారుణానికి అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు దారితీసిన పరిస్థితులు, భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు తదితర అంశాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: స్టాక్ మార్కెట్ లాభాల పేరుతో సైబర్ మోసం.. రిటైర్డ్ ఉద్యోగికి రూ.69.75 లక్షల టోకరా
