వినాయక చవితి ఉత్సవాల సందడి మొదలవడంతో సైబర్ నేరగాళ్లు కూడా తమ మోసాలకు పదును పెడుతున్నారు. పండుగను ఆసరాగా చేసుకుని ప్రజలను బురిడీ కొట్టించేందుకు కొత్త తరహా ఆన్‌లైన్ మోసాలకు తెరతీస్తున్నారు.
వినాయక విగ్రహాలు, పూజా సామగ్రి, లడ్డూ ప్రసాదాన్ని తక్కువ ధరకే అందిస్తామని సోషల్ మీడియా, వాట్సాప్ తదితర వేదికల్లో నకిలీ ప్రకటనలు పెడుతున్నారు. ఆ ప్రకటనలను నమ్మి ఆన్‌లైన్‌లో చెల్లింపులు చేసిన తర్వాత మోసగాళ్లు స్పందించకుండా తప్పించుకునే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
అంతేకాకుండా గణేశ్ మండపాలకు విరాళాలు అందించాలంటూ లేదా లక్కీ డ్రా, ప్రత్యేక బహుమతుల పేరుతో కూడా అనుమానాస్పద లింకులను పంపుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. అలాంటి లింకులపై క్లిక్ చేయడం వల్ల వ్యక్తిగత వివరాలు, బ్యాంకు సమాచారం సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లే ప్రమాదం ఉంది.
ఈ నేపథ్యంలో పండుగ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. గుర్తుతెలియని వ్యక్తులు పంపే లింకులు, క్యూఆర్ కోడ్‌లు, ఆఫర్లను నమ్మి వెంటనే డబ్బులు చెల్లించవద్దని స్పష్టం చేశారు. ఏదైనా సైబర్ మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు సమాచారం అందించాలని సూచించారు.
పండుగ సందడిలో జాగ్రత్తే రక్షణ.. ఆన్‌లైన్ ఆఫర్ కనిపిస్తే ఒకసారి ఆలోచించి, ఆ తర్వాతే స్పందించండి.
also read: గౌహతిలో దారుణ హత్య.. భార్యను చంపి ఫ్రిడ్జ్‌లో తల దాచిన భర్త
