అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కోనేటి సులోచన అనే మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అప్పులు ఇప్పిస్తామని నమ్మించి, ఆ తర్వాత బాధితులను బెదిరిస్తూ వారి ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆమెపై కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసు దర్యాప్తులో భాగంగా సులోచన నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పలు ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, ప్రాంసరీ నోట్లు, ఖాళీ బాండ్లు, స్టాంప్ పేపర్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
స్వాధీనం చేసుకున్న పత్రాల్లో ఏమైనా మార్పులు, అక్రమ లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయా అనే విషయాన్ని నిర్ధారించేందుకు వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నట్లు డీఎస్పీ బుచ్చి రాజు వెల్లడించారు.
ఫోరెన్సిక్ నివేదిక, దర్యాప్తులో వెలుగుచూసే ఇతర ఆధారాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంలో మరెవరైనా ప్రమేయం ఉందా అనే కోణంలోనూ విచారణ కొనసాగుతున్నట్లు సమాచారం.
also read: గొండియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి
