Homeక్రైమ్పంట బోదెలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం.. పామర్రులో కలకలం

పంట బోదెలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం.. పామర్రులో కలకలం

కృష్ణా జిల్లా పామర్రు మండలంలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం వెలుగుచూడటం స్థానికంగా కలకలం రేపింది. శ్యామలాపురం సమీపంలోని పంట బోదెలో వృద్ధుడి మృతదేహాన్ని స్థానికులు గుర్తించినట్లు సమాచారం.

పోలీసుల ప్రాథమిక అంచనా ప్రకారం.. మృతదేహం సుమారు నాలుగు రోజుల క్రితం అక్కడికి చేరి ఉండవచ్చని, అప్పటి నుంచే అక్కడే పడి ఉండటంతో గుర్తుపట్టలేని స్థితికి చేరినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పరిశీలించి పరిసర ప్రాంతాల్లో వివరాలు సేకరించారు. మృతుడి ఆచూకీ, అతడి కుటుంబ సభ్యుల వివరాలను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.

మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించే ఏర్పాట్లు చేసిన పోలీసులు.. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వృద్ధుడి మృతికి గల కారణాలు, అతడు అక్కడికి ఎలా వచ్చాడనే అంశాలపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు.

also read: పల్నాడులో విషాదం.. అబార్షన్ కిట్ వాడిన 17 ఏళ్ల మైనర్ బాలిక మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు