Homeక్రైమ్స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి.. 

స్కూల్ బస్సు కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి.. 

క్రైమ్ మిర్రర్ : సంగారెడ్డి జిల్లా సదాశివపేటలోని సిద్ధాపూర్ కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రైవేట్ పాఠశాల బస్సు కింద పడి రెండేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పటివరకు ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి క్షణాల్లోనే విగతజీవిగా మారడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

మంగళవారం సాయంత్రం పాఠశాల సమయం ముగియడంతో విద్యార్థులను ఇళ్ల వద్ద దించేందుకు స్కూల్ బస్సు బయలుదేరింది. ఒక్కో విద్యార్థిని వారి నివాసాల వద్ద దింపుకుంటూ బస్సు సిద్ధాపూర్ కాలనీకి చేరుకుంది. అదే సమయంలో ఎఫ్రాయిమ్ (2) తన అన్నయ్యను ఇంటికి తీసుకెళ్లేందుకు బస్సు వద్దకు వెళ్లినట్లు సమాచారం.

బస్సు దగ్గరకు చిన్నారి చేరుకున్న సమయంలో ప్రమాదవశాత్తూ అతడు వాహనం టైర్ కింద పడిపోయాడు. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. చిన్నారి కేకలు వినిపించడంతో తల్లిదండ్రులు వెంటనే ఇంటి నుంచి బయటకు వచ్చారు. కళ్లముందే కుమారుడు విగతజీవిగా కనిపించడంతో వారు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

ఈ ఘటన స్థానికులను కూడా తీవ్రంగా కలచివేసింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సిద్ధాపూర్ కాలనీకి చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యులు, స్థానికులను విచారించి ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బస్సు కదిలిన సమయంలో జరిగిన పరిణామాలు, డ్రైవర్‌ నిర్లక్ష్యం ఏమైనా ఉందా అనే అంశాలను కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. చిన్నారి మృతితో సదాశివపేటలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
also read : మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి, ఏడుగురికి గాయాలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు