Homeజాతీయంగుండెపోటుకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా? నిజానిజాలు ఇవే!

గుండెపోటుకు కోవిడ్ వ్యాక్సిన్ కారణమా? నిజానిజాలు ఇవే!

కొవిడ్ వ్యాక్సిన్ల వల్ల యంగ్ ఏజ్‌లోనే గుండెపోట్లు వస్తున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని ప్రముఖ వైద్యులు ఖండించారు. ఇవన్నీ కేవలం ఆధారాలు లేని అపోహలు మాత్రమేనని, ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
2021-22 సమయంలో వేసుకున్న కొవిడ్ టీకాల వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని వైద్యులు తేల్చిచెప్పారు. పైగా, కొవిడ్ సంక్రమణ వల్ల కలిగే తీవ్రమైన గుండె సంబంధిత సంక్లిష్టతల నుంచి ఈ వ్యాక్సిన్లు రక్షణ కలిగిస్తాయని వివరించారు.యువతలో గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాలు పెరగడానికి అసలైన కారణాలు వేరే ఉన్నాయని నిపుణులు ఎత్తిచూపారు:

తక్కువ నిద్ర:- రోజుకు కనీసం 5 గంటల కంటే తక్కువ సమయం నిద్రపోవడం.

అధిక పని ఒత్తిడి:- వారానికి 55 గంటలకు పైగా పని చేయడం వల్ల కలిగే మానసిక, శారీరక ఒత్తిడి.

కాలుష్యం & జీవనశైలి:- పెరిగిపోతున్న వాయు కాలుష్యం మరియు శారీరక శ్రమ లేకపోవడం.

ఈ ప్రతికూల జీవనశైలి అలవాట్ల వల్ల గుండెపోటు మరియు స్ట్రోక్ ముప్పు దాదాపు 35% వరకు పెరుగుతుందని హెచ్చరించారు. కాబట్టి వ్యాక్సిన్లపై అసత్య ప్రచారాలను నమ్మకుండా, తగినంత నిద్ర, సమతులాహారం మరియు క్రమబద్ధమైన జీవనశైలిని పాటించాలని సలహా ఇచ్చారు.

ఏపీలో గణేష్ మండపాలకు గుడ్ న్యూస్: ఉచిత కరెంట్ ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేష్ ప్రకటన!

ప్రభుత్వ అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు