నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించిన యువతి మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతుందన్న ఆవేదనతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ధర్పల్లి మండలం మరియా తండాలో చోటుచేసుకుంది.
స్థానిక సమాచారం ప్రకారం.. ఓ యువతిని ప్రేమించిన యువకుడు ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించినట్లు తెలుస్తోంది. అయితే ఆ యువతి మరో పెళ్లికి సిద్ధమవుతోందని తెలియడంతో తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో సెల్ఫీ వీడియో తీస్తూ పురుగుల మందు సేవించినట్లు తెలుస్తోంది.
కాసేపటికే పరిస్థితి విషమించడంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
also read: ఢిల్లీలో ఆక్సిజన్ సిలిండర్ పేలుడు.. ఒకరి మృతి, నలుగురికి గాయాలు
