Homeక్రైమ్తెలంగాణ రెరా ఇన్చార్జిగా జయేష్ రంజన్...!

తెలంగాణ రెరా ఇన్చార్జిగా జయేష్ రంజన్…!

  • గత కొద్ది రోజుల ఉత్కంఠకు తెర

  • ఆహ్వానిస్తున్న బిల్డర్లు, డెవలపర్లు

  • సామాన్యుల నుంచి సైతం హర్షాతిరేకాలు

క్రైమ్ మిర్రర్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలో నెలకొన్న అనిశ్చితికి తెర దించుతూ.. తెలంగాణ రేరా ఇంచార్జ్ చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారి, మున్సిపల్ పరిపాలన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీచేసింది.

గత వారమే అనారోగ్య కారణాలతో ఎం సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేయడంతో ఖాళీ అయింది. ఇప్పుడు అత్యంత సమర్థవంతమైన అధికారిగా పేరు తెచ్చుకున్న జయేష్ రంజన్ కు బాధ్యతలు అప్పగించింది.

సుదీర్ఘ అనుభవం..
జయేష్ రంజన్ నియామకంపై రియల్ ఎస్టేట్ రంగం నుంచి హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఐటీతోపాటు పరిశ్రమల శాఖల్లో సుదీర్ఘ అనుభవం ఉంది ఆయనకు. రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిస్థితులపై కూడా సమగ్ర అవగాహన ఉంది.. అటువంటి వ్యక్తికి రేరా బాధ్యతలు అప్పగించడం శుభపరిణామం అని బిల్డర్లతోపాటు డెవలపర్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల క్లియరెన్స్ విషయంలో ఆయన తీసుకునే నిర్ణయాలు మార్కెట్కు కొత్త ఊపిరి పోస్తాయని అంచనా వేస్తున్నారు.

గత కొద్ది రోజులుగా ఖాళీ..
రేరా చైర్మన్ పోస్ట్ కాళీ తో రియల్ ఎస్టేట్ రంగం ఒక విధంగా ఆందోళనకు గురైంది. అయితే తాజా నియామకంతో ఇళ్ల కొనుగోలుదారులలో ఒకరకం భరోసా కనిపిస్తోంది. రేరా నిబంధనల కఠిన అమలు, కస్టమర్ల ఫిర్యాదుల పరిష్కారంలో ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి తనదైన ముద్ర వేయగలరని సామాన్యులు సైతం ఆశిస్తున్నారు.

తెలంగాణ రియల్ ఎస్టేట్ వ్యవస్థను మరింత జవాబుదారీతనంతో కూడిన అభివృద్ధి, ఆధారిత పర్యావరణంగా మార్చడంలో ఈ నియామకం ఎంతగానో దోహదపడుతుందన్న అభిప్రాయం ఏర్పడుతోంది. హైదరాబాద్ వంటి అంతర్జాతీయ నగరంలో రియల్ ఎస్టేట్ రంగం సంక్షోభం వైపు వెళ్లకుండా.. సరైన సమయంలో సమర్ధుడైన అధికారికి బాధ్యతలు అప్పగించడం పై అభినందనలు వెలువెత్తుతున్నాయి.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు