Homeక్రైమ్హనుమకొండలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం

హనుమకొండలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం

హనుమకొండ జిల్లా కాజీపేటలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో ఓ కానిస్టేబుల్ ప్రాణాలు కోల్పోయారు. విధులు ముగించుకుని వెళ్తున్న సమయంలో జరిగిన ఈ ఘటన కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. కాజీపేట డీజిల్ కాలనీకి చెందిన డోలి విజయ్‌కుమార్ (40) దుగ్గొండి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మంగళవారం తెల్లవారుజామున ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా బట్టుపల్లి శివారులో ప్రమాదవశాత్తు అదుపు తప్పి కిందపడ్డారు.

ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలైన విజయ్‌కుమార్ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. కుటుంబానికి అండగా నిలిచిన విజయ్‌కుమార్ ఆకస్మిక మృతితో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. సహచర పోలీసు సిబ్బంది కూడా ఆయన మృతిపై విచారం వ్యక్తం చేశారు.

also read: షారుఖ్ ఖాన్ ‘మన్నత్’కు సుప్రీం రిలీఫ్.. నిర్మాణ అనుమతులపై పిటిషన్ కొట్టివేత

తాజావార్తలు