క్రైం మిర్రర్ : సమాజంలో ఇప్పటికీ మూఢనమ్మకాలు ఎంతటి విషాదాలకు దారితీస్తున్నాయో మరోసారి రుజువైంది. వైద్యం, శాస్త్రీయ చికిత్సలపై నమ్మకం పెట్టుకోవాల్సిన చోట క్షుద్రపూజల పేరుతో ఓ అమాయక బాలుడి ప్రాణం బలైంది. ప్రకాశం జిల్లాలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. వైకల్యంతో బాధపడుతున్న బాలుడికి నయం చేసి నడుపిస్తానని కుటుంబ సభ్యులను మొబీనా అనే మహిళ నమ్మించింది. దీంతో వైకల్యం పోతుందని పూజలు చేసేందుకు తల్లిదండ్రులు అనుమతి ఇచ్చారు. పూజల పేరుతో అతడిని చిత్రహింసలకు గురి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. బాలుడి రెండు చేతులను తాళ్లతో కట్టేసిన మొబీనా అతడిని కొడుతూ తీవ్రంగా గాయపరిచింది. దీంతో దారుణమైన దాడిని తట్టుకోలేక బాలుడు అక్కడికక్కడే మృతి చెందినప్పటికీ, అతడిని తిరిగి బతికిస్తానంటూ ఆమె పూజలు కొనసాగించడం మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. విషయం ఆలస్యంగా గుర్తించిన కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలంలో లభ్యమైన ఆధారాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టగా, నిందితురాలిపై స్థానికులు, బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
also read : Ketan Agarwal Death Case: ప్రధాని మోదీకి తల్లి లేఖ.. కుమారుడికి న్యాయం చేయాలని వేడుకోలు