Homeవైరల్అర నిమిషంలో 195 కిస్సులు.. బ్రెజిల్ జంట గిన్నిస్ వరల్ఢ్ రికార్డ్!

అర నిమిషంలో 195 కిస్సులు.. బ్రెజిల్ జంట గిన్నిస్ వరల్ఢ్ రికార్డ్!

ప్రేమను ప్రత్యేకంగా వ్యక్తపరిచే విధానాలు ఎన్నో ఉన్నా, బ్రెజిల్‌కు చెందిన ఒక జంట మాత్రం తమ ప్రేమను ప్రపంచ రికార్డుగా మార్చుకుంది. రెనటో అల్వెస్ మరియు నైరా రాబెర్టా అనే జంట కేవలం 30 సెకండ్లలో 195 ముద్దులు పెట్టుకుని గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌లో స్థానం సంపాదించింది. అర నిమిషంలో అత్యధిక ముద్దులు పెట్టుకున్న జంటగా వీరు గుర్తింపు పొందారు.

జూలై 6న జరుపుకునే అంతర్జాతీయ ముద్దుల దినోత్సవం తర్వాత కొద్ది రోజులకే ఈ రికార్డును సృష్టించడం విశేషంగా నిలిచింది. ప్రేమను వేగంతో, ఉత్సాహంతో వ్యక్తపరచడం ద్వారా ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ఈ జంట తమ బంధంపై విశ్వాసంతో ఈ సవాల్‌ను స్వీకరించింది. రెనటో అల్వెస్ ఇప్పటికే పలు గిన్నిస్ రికార్డులు సృష్టించిన వ్యక్తి. రికార్డులు సృష్టించడం తనకు కొత్త కాదని, గెలవడం తనకు అలవాటైందని అతడు చెబుతున్నాడు.

“నేను ఎముక మజ్జ దాతను. అలాగే ADHD (శ్రద్ధ లోపం, హైపర్ యాక్టివిటీ అసమతుల్యత)తో బాధపడుతున్నాను. అయినా కూడా మనం కోరుకున్న లక్ష్యాలను సాధించగలమని నిరూపించాలనుకుంటున్నాను” అని రెనటో తెలిపాడు. ఇక ఇప్పుడు ఈ జంట మరో లక్ష్యంపై దృష్టి పెట్టింది. ఒక నిమిషంలో అత్యధిక ముద్దులు పెట్టుకున్న జంటగా ఇంకో రికార్డు సృష్టించాలని వాళ్లు  భావిస్తున్నారు.

also read: మహేష్ బాబు ఇంట్లో పెళ్లి సందడి.. కొరియన్ అమ్మాయితో ఏడడుగులు వేయనున్నసూపర్ స్టార్ మేనల్లుడు సిద్ధార్థ్ గల్లా

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు