Homeతెలంగాణసంక్షోభంలో విజయ్ సర్కార్...!

సంక్షోభంలో విజయ్ సర్కార్…!

  • కొలువుదీరిన ఆరు నెలలకే సమస్యలు

  • కట్టు దాటుతున్న ఎమ్మెల్యేల క్రమశిక్షణ

  • వెంటాడుతున్న మతపరమైన వివాదాలు…

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : తమిళనాడులో మార్పు నినాదంతో అధికారంలోకి వచ్చారు టీవీ కే విజయ్. అనూహ్యంగా అక్కడి ప్రజలు అవకాశం ఇచ్చారు. అయితే అధికారం చేపట్టిన ఆరునెలలకే ఊహించని రాజకీయ, పాలనాపరమైన సంక్షోభాల సుడిగుండంలో చిక్కుకున్నారు విజయ్. సినీ గ్లామర్ తో పాటు భారీ ప్రజాకర్షణతో గద్దెనెక్కారు. కానీ క్షేత్రస్థాయి పాలనలో ఎదురవుతున్న సవాళ్లు ఆయనకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల మధురాంతకం, ధరాపురం రెండు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీవీకే అభ్యర్థులు విజయం సాధించారు. కానీ ఆ గెలుపు అంత సులువుగా రాలేదు. ప్రత్యర్థి డిఎంకె, ఏఐడీఎంకే కూటముల నుంచి గట్టి పోటీ ఎదురై.. అతి కష్టం మీద ఘట్టెక్కాల్సి రావడం అధికార పార్టీకి తొలి హెచ్చరికగా మారింది.

డీఎంకే ఎదురుదాడి…

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ప్రధాన ప్రతిపక్షం ఎదురుదాడి ప్రారంభించింది. ఉదయనిది స్టాలిన్ తో సహా మిగతా విపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కట్టు తప్పి ప్రవర్తించడం విజయ్ ప్రభుత్వానికి తలవొంపులు తెస్తోంది. ఒక మహిళా కలెక్టర్ ని అధికార పార్టీ ఎమ్మెల్యే వేదించారన్న ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ కేసులో కోర్టు మెట్లు ఎక్కాల్సి కూడా వచ్చింది. ఆ ఎమ్మెల్యేను ప్రభుత్వం వెనుకేసుకొస్తుందన్న విమర్శలు రావడం చూస్తుంటే… కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు అధికారాన్ని ఎంతలా టేక్ ఇట్ గ్రాండ్ గా తీసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అదుపుతప్పుతున్న సొంత పార్టీ ప్రజాప్రతినిధులకు కళ్లెం చేయలేక సీఎం మౌనంగా ఉండడం ఆయన ప్రతిష్టను మరింత దెబ్బతీస్తోంది.

తప్పుడు సూచనలు…

ఇంకోవైపు సున్నితమైన మతపరమైన, సామాజిక అంశాల్లో మిత్రపక్షాలు, సలహాదారులు ప్రభుత్వానికి తప్పుదోవ పట్టిస్తున్నారని అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. తాజాగా తిరుప్పరకుండ్రమ్ కార్తీకదీపం వివాదంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ.. సంప్రదాయం పేరుతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్ద రాజకీయ వివాదానికి దారి తీసింది. ఇవి వ్యవహారం కోర్టు ధిక్కరణ పిటిషన్ ల వరకు వెళ్లడమే కాకుండా హిందూ సంఘాలు, బిజెపి ఆందోళనలతో విజయ్ రాజకీయంగా గట్టి ఎదురు దెబ్బతిన్నారు. రెండు వైపులా మెప్పించబోయి అసలుకే ఎసరు తెచ్చుకున్నారు. ఈ వివాదం ప్రభుత్వాన్ని పూర్తిగా డ్యామేజ్ చేసింది.

అత్యంత క్లిష్ట సమయం…

రాజకీయంగా అత్యంత క్లిష్ట సమయంలో విజయ్ ఉన్న పరిస్థితుల్లో మరో ఎన్నికలు సమీపిస్తున్నాయి. వివిధ పార్టీల నుంచి గెలిచి టీవీ కే లో చేరిన వారు రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. స్టాలిన్ పై గెలిచిన బాబు అనే ఎమ్మెల్యే చనిపోయారు. అక్కడ కూడా ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. విజయ్ అసెంబ్లీలో తన సొంత బలాన్ని నిరూపించుకోవడానికి ఈ ఐదు స్థానాల ఫలితాలు అత్యంత కీలకంగా మారాయి. కలెక్టర్ వేధింపుల వివాదం, తిరుప్పుర కుండ్రం దీపం సెగ, శాంతి భద్రతల వైఫల్యాల నడుమ జరగబోయే ఈ ఉప ఎన్నికలు సీఎం విజయ్ నాయకత్వానికి పెను విషమ పరీక్ష గా మారనున్నాయి. కేవలం సినిమా ఇమేజ్తో ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపడం అసాధ్యం.. కట్టు తప్పిన ఎమ్మెల్యేలపై కఠిన చర్యలు తీసుకోవడం, మిత్రపక్షాల ఒత్తిళ్లకు తలకోకుండా స్వతంత్రంగా వ్యవహరించడం.. పాలనపై పట్టు సాధించడం తక్షణం అవసరం. లేదంటే రాబోయే ఐదు ఉప ఎన్నికల్లో ఏమాత్రం తేడా జరిగినా అది ప్రభుత్వ మనుగడకే ముప్పుగా మారనుంది. విజయ్ ఎదుర్కొంటున్న సమస్యలు మరింత జఠిలమయ్య అవకాశం ఉంది.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. హిట్‌మ్యాన్ రీ-ఎంట్రీ: ముంబై ఇండియన్స్ తలరాత మారనుందా?
  2. బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సునామీ: ₹1,000 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త చరిత్ర!
  3. ప్రపంచానికి పొంచి ఉన్న ఆకలి ముప్పు
  4. దక్షిణాదికి పెరగనున్న రాజకీయ బలం: సీఎం చంద్రబాబు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు