హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు హింసాత్మక ఘటనకు దారితీశాయి. రాజేంద్రనగర్ బస్ డిపో సమీపంలో ఓ వ్యక్తిపై కత్తులతో దాడి జరగడం స్థానికంగా కలకలం రేపింది. కుటుంబ వివాదాల నేపథ్యంలో బావమరిదిపై బావలు కత్తులతో దాడికి పాల్పడినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే.. రాజేంద్రనగర్ బస్ డిపోలో ప్రైవేట్ ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్న అక్తర్‌పై ఆయన బావలు కత్తులతో దాడి చేశారు. బస్ డిపో ఎదుటే ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ దాడిలో అక్తర్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్పందించిన స్థానికులు, బాధితుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కుటుంబ కలహాలే ఈ దాడికి కారణమని ప్రాథమికంగా తెలుస్తోంది. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటనపై కేసు నమోదు చేశారు. దాడికి గల పూర్తి కారణాలు, ఘటనకు సంబంధించిన ఇతర వివరాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బహిరంగ ప్రదేశంలో కత్తులతో దాడి జరగడంతో స్థానికంగా ఆందోళన నెలకొంది.
also read: కనకదుర్గమ్మ ఆలయంలో ప్రసాదాల విక్రయాల్లో అక్రమాలు.. ఉద్యోగిపై వేటు!
