-
రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే.. వెంకటరెడ్డిని తొలగించాల్సిందే
-
మరోసారి మంత్రివర్గ విస్తరణ పై గట్టి చర్చ
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రివర్గ విస్తరణ మరోసారి హాట్ టాపిక్ గా మారింది. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్న టాప్ నడుస్తోంది. ఈనాపద్యంలో కోమటిరెడ్డి సోదరుల మధ్య మంత్రి పదవి వ్యవహారం గట్టి చర్చకు దారి తీస్తోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం చేస్తున్న పట్టుదల, ఆయన సోదరుడు, ప్రస్తుత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పిస్తే తప్ప రాజగోపాల్ రెడ్డికి చాన్స్ దక్కదు. అయితే వెంకటరెడ్డి తో తనకు సంబంధం లేదని.. తనకు పదవి ఇవ్వాల్సిందేనని రాజగోపాల్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. మంత్రివర్గంలో ఒకే కుటుంబానికి రెండు బెర్త్ లు దక్కడం అసాధ్యం అని రాజగోపాల్ రెడ్డికి తెలియంది కాదు. అయినా సరే తనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరుకుంటూ వచ్చారు.
పరోక్ష ఒత్తిడి…
కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక శాఖలకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. క్యాబినెట్లో ఖాళీగా ఉన్న బెర్తుల కోసం రెడ్డి సామాజిక వర్గం నుంచి కాకుండా ఇతర వర్గాల నుంచి తీవ్ర పోటీ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కావాలని గట్టిగా పట్టుబడుతున్నారంటే.. వెంకటరెడ్డిని తప్పించి అయినా లేదా ఆయనకు ప్రత్యామ్నాయంగా అయినా అవకాశం కల్పించాలని పరోక్షంగా ఒత్తిడి తెస్తున్నారు. గతంలో తాము ఒకే కుటుంబం కాదంటూ రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మాకు మేమే వేరు.. మా రాజకీయ దారులు వేరు అని చెప్పుకుంటూ వచ్చారు రాజగోపాల్ రెడ్డి. మంత్రి పదవి విషయంలో ఆ లెక్కలను తనకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారు.
అసహనంతో…
మంత్రి పదవి ఆలస్యం అవుతుండడంతో రాజగోపాల్ రెడ్డిలో ఒక రకమైన అసంతృప్తి బయటపడుతోంది. నిధుల కొరత, గత హామీల ప్రస్తావనతో రాజగోపాల్ రెడ్డి దూకుడు పెంచుతుండగా.. అది అన్నదమ్ములే మధ్య ఉన్న రాజకీయ సమీకరణలపై ప్రభావం చూపుతోందని చర్చ జోరుగా సాగుతోంది. అయితే పార్టీ అధిష్టానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ వ్యవహారాన్ని ఎలా డీల్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. కుటుంబ సమీకరణలు, సామాజిక న్యాయం, పార్టీ క్రమశిక్షణ మధ్య సమకూర్యత పాటిస్తూ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి గట్టి పోరాటం సాగిస్తున్నారు. మరి తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జ్ గా నియమితులైన బిఎం సందీప్ ఎలా దీనిని దారికి తెస్తారో చూడాలి.
