Homeతెలంగాణరాజ్యాంగం హక్కులనే కాదు..బాధ్యతలను కూడా గురిచేస్తుంది

రాజ్యాంగం హక్కులనే కాదు..బాధ్యతలను కూడా గురిచేస్తుంది

-సమానత్వ సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం
-మునుగోడులో ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
-ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ
-జాతీయ మాలమహానాడు,అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యములో వేడుకలు

మునుగోడు,క్రైమ్ మిర్రర్:- భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలను మునుగోడు మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. జాతీయ మాలమహానాడు మునుగోడు మండల కమిటీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు,శిక్షణ పొందుతున్న విద్యార్దులకు పండ్లు పంపిణీ చేశారు..మండల అధ్యక్షుడు బొల్లు సైదులు కొరటికల్ సర్పంచ్ అద్దంకి రామలింగయ్య లు మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం వంటి విలువలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని పేర్కొన్నారు.రాజ్యాంగం హక్కులనే కాదు బాధ్యతలను కూడా గుర్తు చేస్తుంది.రాజ్యాంగ విలువలను గౌరవిస్తూ సమానత్వం మరియు సామాజిక న్యాయం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జాతీయ మాలమహానాడు మునుగోడు మండల అధ్యక్షుడు బొల్లు సైదులు, కొరటికల్ సర్పంచ్ అద్దంకి రామలింగయ్య, ఉపాధ్యక్షులు గుల్లి శంకర్, అన్నిమల్ల నాగరాజు, ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి దుర్గాప్రసాద్, జర్నలిస్టు పెరుమాళ్ల ప్రమోద్ కుమార్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు పెరుమాండ్ల ప్రణయ్ కుమార్, ఈద రాములు, ఈద శరత్ బాబు, ముచ్చపోతుల శ్రీకాంత్, ఈద సైదులు, దొడ్డి రవి, పిట్టల రఘు, ఈద సుదర్శన్, అద్దంకి అంజయ్య,మాజీ అధ్యక్షుడు చలిచీమల యాదయ్య, పెరుమాళ్ల రామ్, ఈసం గణేష్, గాలి జీవన్, బసనగర రాము, ముచ్చపోతుల భరత్, గోలి నరసింహ తదితరులు, అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు, మేధావులు, యువకులు పాల్గొన్నారు.

కేసీఆర్ ఆమరణ దీక్షపై ఆసక్తికర డాక్యుమెంటరీ.. ‘నాట్ ఎ మహాత్మా’ ట్రైలర్ విడుదల!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు