Homeక్రైమ్రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు...! వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్...

రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు…! వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్…

హైదరాబాద్, క్రైమ్‌మిర్ర‌ర్‌: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వైసీపీ నేతను చిక్కుల్లో పడేశాయి. ఈ క్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే పోలీసులు ఆయనను నివాసం నుండి తీసుకువెళ్లారని కుటుంబసభ్యులు చెబుతున్నారు. తాము తెలంగాణ పోలీసులమంటూ నాగార్జున యాదవ్ కుటుంబ సభ్యులకు తెలిపిన సిబ్బంది, నాగార్జున యాదవ్ అరెస్టుకు సంబంధించిన సమాచారాన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్‌కు అందిస్తామని చెప్పారు. అయితే ముందస్తు సమాచారం లేకుండా జరిగిన అరెస్టుతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం స్తున్నారు.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నాగార్జున యాదవ్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలే ఈ అరెస్టుకు కారణమని తెలుస్తోంది.

Also Read:టాలీవుడ్‌లో మరోసారి ‘భగవంత్ కేసరి’ మ్యాజిక్!

ఒక టీవీ ఛానెల్ నిర్వహించిన లైవ్ డిబేట్‌లో పాల్గొన్న ఆయన.. రేవంత్ రెడ్డిపై తీవ్ర పదజాలంతో రెచ్చిపోయారు. సీఎం పదవిలో ఉన్న రేవంత్ రెడ్డిని అత్యంత చులకనగా చేసి మాట్లాడుతూ.. ఒక ‘జొమాటో, స్విగ్గీ డెలివరీ బాయ్’తో పోల్చారు. రేవంత్ డెలివరీ బాయ్ అని, ఆయనకు ఒక ప్రభుత్వ జీవో (GO) చదవడం కూడా రాదని, కనీసం ఎమ్మెల్యేగా గెలవడానికి కూడా పనికిరాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏకవచనంతో సంబోధిస్తూ రేవంత్‌ను తీవ్రంగా దూషించారు. న్యూస్ ప్రజెంటర్ అలాంటి మాటలు కరెక్ట్ కాదని, రాజకీయంగా విమర్శలు చేయడం వరకు పరవాలేదన్నారు. అయినా వెనక్కి తగ్గకుండా నాగార్జున యాదవ్ టీవీ డిబేట్‌లో రెచ్చిపోయారు. అంతటితో ఆగకుండా తాను రేవంత్ రెడ్డిని, స్విగ్గీ, జొమాటో డెలివరీ బాయ్స్‌తో పోల్చడం.. డెలివరీ బాయ్స్‌ను అవమానించడం అవుతుందంటూ వారికి సారీ కూడా చెప్పారు.

Also Read:భారత్ vs ఇంగ్లాండ్ తొలి వన్డే.. నేటి నుంచే వన్డే సిరీస్ సమరం!

ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్టుపై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ నడుస్తోంది. ఒక రాష్ట్ర సీఎంను ఈ విధంగా కించపరచడం తగదని కొందరు నెటిజన్లు సూచించారు. అయితే గతంలో వైఎస్ జగన్‌పై జరిగిన విమర్శలను, కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి చేసిన పాత వ్యాఖ్యలను మరికొందరు నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. సీఎం హోదాలో ఉన్న వ్యక్తులను రేవంత్ కూడా గౌరవం ఇవ్వలేదని, తీవ్ర పదజాలం వాడతారని కొందరు నెటిజన్లు ఘాటుగా స్పందిస్తున్నారు. ఏదేమైనా, ఇటీవల కాలంలో నేతల మధ్య రాజకీయ విమర్శలకు బదులుగా వ్యక్తిగత దూషణలు హద్దులు మీరుతున్నాయని ప్రజలు సైతం గమనిస్తూనే ఉన్నారు. వాక్ స్వాతంత్య్రం పేరుతో సీఎంపై తీవ్ర వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం, దూషించడం ప్రజాస్వామ్యానికే ముప్పు అని రాజకీయ విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Also Read:Mana Jampala: 9 ఏళ్లకే కోడింగ్.. 12 ఏళ్లకే ఏఐ CEO.. అబ్బుర పరుస్తున్న భారత సంతతి చిన్నారి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు