Homeతెలంగాణప్రియుడి చేతిలో ప్రియురాలి ధారుణ హ‌త్యా...! బెంగుళూరులో క‌ల‌క‌లం...

ప్రియుడి చేతిలో ప్రియురాలి ధారుణ హ‌త్యా…! బెంగుళూరులో క‌ల‌క‌లం…

బెంగుళూరు, క్రైమ్‌మిర్ర‌ర్‌: నాలుగేళ్లుగా క‌లిసి చ‌దువుకున్నారు ఆ క్ర‌మంలోనే ఆ జంట ప్రేమించుకున్నారు. కానీ ఉద్యోగం కోసం బెంగుళూరు న‌గ‌రానికి వ‌చ్చారు. కాని అంత‌లోనే వారు తీసుకున్న లాడ్జ్ లో ప్రియురాలు దారుణ హ‌త్య‌కు గురికావ‌డంతో ఆ ప్రాంతంలో తీవ్ర క‌ల‌క‌లం రేపింది. కేర‌ళ‌కు చెందిన గంగా(22), గోకుల్ కృష్ణ‌(23) క‌లిసి ఒక కాలేజీలో న‌ర్సింగ్ విద్య‌ను పూర్తి చేశారు. ఈ క్ర‌మంలో ఇరువురు ప్రేమించుకున్నారు. ఈ క్ర‌మంలోనే గంగా, గోకుల్ కృష్ణ క‌ల‌సి జాబ్ కోసం క‌ర్ణాట‌క రాజ‌ధాని బెంగుళూరుకు చేరుకున్నారు. నవంబర్ 26న కాటన్‌పేట ప్రాంతంలోని ఒక లాడ్జిలో వారు బస చేశారు. అయితే గంగకు మరో వ్యక్తితో సంబంధం ఉన్నదని ప్రియుడు గోకుల్‌ అనుమానించాడు. లాడ్జిలో బస చేసిన ఈ జంట మధ్య ఈ విషయంపై గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన గోకుల్‌ కృష్ణ కత్తితో గంగను పొడిచి హత్య చేశాడు.

మరోవైపు శుక్రవారం ఉదయం ఆ జంట బస చేసిన రూమ్‌ సమీపంలోని మెట్ల వద్ద రక్తపు మరకలను లాడ్జి సిబ్బంది గమనించారు. ఏదో అవాంఛనీయ సంఘటన జరిగిందని అనుమానించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఆ లాడ్జి వద్దకు చేరుకున్నారు. రూమ్‌ లోపల రక్తం మడుగులో పడి ఉన్న గంగను గమనించారు. సమీపంలోని ఆసుపత్రికి ఆమె తరలించారు. అయితే ఆ యువతి అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. దీంతో గోకుల్ కృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. హిట్‌మ్యాన్ రీ-ఎంట్రీ: ముంబై ఇండియన్స్ తలరాత మారనుందా?
  2. బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ సునామీ: ₹1,000 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త చరిత్ర!
  3. ప్రపంచానికి పొంచి ఉన్న ఆకలి ముప్పు
  4. దక్షిణాదికి పెరగనున్న రాజకీయ బలం: సీఎం చంద్రబాబు!

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు