టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ పేరుతో జరుగుతున్న కొన్ని ప్రచారాలపై ఆయన కార్యాలయం స్పందించింది. సోషల్ మీడియాలో చర్చకు వచ్చిన ‘RAW NTR’ అనే సంస్థతో ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని ఆయన వ్యక్తిగత కార్యాలయం స్పష్టం చేసింది.
ఈ మేరకు ఎన్టీఆర్ టీమ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తన పేరును ఉపయోగిస్తూ కొందరు వ్యక్తులు చేస్తున్న కార్యకలాపాలు తమ దృష్టికి వచ్చాయని తెలిపింది. అయితే ఆ సంస్థతో, ఆ సంస్థ చేపడుతున్న కార్యక్రమాలతో జూ. ఎన్టీఆర్‌కు ఎలాంటి అనుబంధం లేదని వెల్లడించింది.
also read: హనుమకొండలో విషాదం.. రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణం
ఎన్టీఆర్ పేరుతో ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా కొన్ని ప్రచారాలు జరుగుతున్నాయని కార్యాలయం పేర్కొంది. ఎన్టీఆర్ తరఫున మాట్లాడేందుకు లేదా ఆయన పేరును ఉపయోగించేందుకు ఎలాంటి అనుమతి ఎవరికీ ఇవ్వలేదని స్పష్టం చేసింది. అలాగే జూనియర్ ఎన్టీఆర్ చేపట్టే సేవా కార్యక్రమాలు, సామాజిక కార్యక్రమాలకు సంబంధించిన అధికారిక సమాచారాన్ని ఆయన అధికారిక బృందం మాత్రమే వెల్లడిస్తుందని తెలిపింది.
అభిమానులు, ప్రజలు సోషల్ మీడియా ప్రచారాలను నమ్మే ముందు అధికారిక సమాచారం ఉందా లేదా పరిశీలించాలని ఎన్టీఆర్ కార్యాలయం సూచించింది. అనధికారిక వ్యక్తులు లేదా సంస్థలు చేసే ప్రకటనలకు ఎన్టీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని మరోసారి స్పష్టం చేసింది.
ఈ ప్రకటనతో ‘RAW NTR’కు సంబంధించి వస్తున్న అనుమానాలు, ఊహాగానాలకు తెరపడుతుందని ఎన్టీఆర్ టీమ్ ఆశాభావం వ్యక్తం చేసింది.
also read: సింగరాయకొండలో విషాదం.. గూడ్స్ రైలు కింద పడి దంపతులు, ఇద్దరు పిల్లలు ఆత్మహత్య