-
ఫోర్జరీ పత్రాలతో వెంచర్.. కోట్ల రూపాయల అవినీతి జరిగిందా…?
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి నిఘా బ్యూరో: జీహెచ్‌ఎంసీ బడంగ్‌పేట్ సర్కిల్ పరిధిలోని బాలాపూర్ గ్రామ సమీపంలో సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా భారీ వెంచర్ ఏర్పాటు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు, సంబంధిత సిబ్బంది కుమ్మక్కయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమాచారం ప్రకారం, కొత్త వెంచర్లు హెచ్‌ఎండీఏ నిబంధనల మేరకే అభివృద్ధి చేయాలి. రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్, పార్కులు వంటి మౌలిక వసతులు కల్పించడంతో పాటు అవసరమైన భూమిని ప్రజా అవసరాల కోసం కేటాయించాలి. అయితే ఈ నిబంధనలను తప్పించుకోవడానికి కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఫోర్జరీ లేఅవుట్లు, నకిలీ ఎల్‌ఆర్‌ఎస్ పత్రాలు, సర్పంచుల నకిలీ సంతకాలతో పత్రాలు సృష్టించి అక్రమంగా వెంచర్ అభివృద్ధి చేశారని ఆరోపణలు ఉన్నాయి.
Also Read:లెనిన్’ లో భారతి పాత్రకు ప్రేక్షకుల ఆదరణ జీవితాంతం మర్చిపోలేను… హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే…!
అంతేకాక, దశాబ్దాల క్రితం ఉన్న భూములకు 2022 తర్వాత నాలా కన్వర్షన్ చేయించి, వాటిని ఆధారంగా చేసుకుని ఇంటి నిర్మాణ అనుమతులు మంజూరు చేశారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమతుల కోసం భారీ మొత్తంలో అక్రమ లావాదేవీలు జరిగాయని స్థానికులు పేర్కొంటున్నారు. బాలాపూర్ గ్రామానికి ఆనుకుని ఉన్న కొంతమోని కుంట సమీపంలోని సర్వే నంబర్లు 88, 89, 90, 272, 273, 275, 276, 277, 278, 281 పరిధిలో ఈ వెంచర్ కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ వెంచర్లను అడ్డుకోవాల్సిన అధికారులే వాటికి సహకరించి నిర్మాణ అనుమతులు ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోందని విమర్శిస్తున్నారు.
Also Read:రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు…! వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్…
ఈ వ్యవహారంపై ఇప్పటికే ఫిర్యాదులు అందినప్పటికీ ఉన్నతాధికారులు స్పందించడం లేదని ఆరోపణలు ఉన్నాయి. బడంగ్‌పేట్ సర్కిల్‌లో చోటుచేసుకుంటున్న ఈ వ్యవహారంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక దృష్టి సారించి, ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: 2027 వన్డే వరల్డ్ కప్‌లో రో-కో ద్వయం.. అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పిన కెప్టెన్ గిల్