Homeతెలంగాణతెలంగాణ టెట్..ఫట్!

తెలంగాణ టెట్..ఫట్!

•23 వేల మంది టీచర్లు పరీక్ష రాస్తే పాస్ అయింది 8,000 మంది..
•తెలంగాణ టెట్ ఫలితాలు ఆందోళనకరం
•ప్రభుత్వ ఉపాధ్యాయుల మెడపై కత్తి
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో :- 

తెలంగాణలో టెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉపాధ్యాయ అర్హత పరీక్ష కొద్ది రోజుల కిందట నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఫలితాల్లో అభ్యర్థులు తీవ్రంగా నిరాశపరిచారు. సగం మంది కూడా క్వాలిఫై కాకపోవడం విశేషం. రాష్ట్ర వ్యాప్తంగా 43.94 శాతం మంది మాత్రమే అర్హత సాధించారు. హైదరాబాదులోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్లో ఎట్ కన్వీనర్ రమేష్, డైరెక్టర్ రేవతి రెడ్డిలతో కలిసి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ ఫలితాలను అధికారికంగా విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 1,15,028 మంది పరీక్షకు హాజరు కాగా.. కేవలం 50వేల 544 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులైతే సగం కంటే తక్కువ మంది పాస్ కావడం గమనార్హం.
* ఎస్జీటీ పోస్టుల కోసం నిర్వహించిన పేపర్ 1 పరీక్షలో 65.29% మంది ఉత్తీర్ణత సాధించారు. 36,129 మంది పరీక్ష రాయగా 23,590 మంది పాసయ్యారు. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం నిర్వహించిన పేపర్ 2 ఫలితాలు మరి ఘోరంగా ఉన్నాయి. మొత్తం 78,899 మంది పరీక్షలు రాస్తే.. కేవలం 26954 మంది మాత్రమే అర్హత సాధించారు. అందులో మ్యాథ్స్ అండ్ సైన్స్ విభాగంలో 40.76% మంది ఉత్తీర్ణత సాధించగలిగారు. సోషల్ స్టడీస్ లో అత్యల్పంగా 25.79 శాతం మంది మాత్రమే క్వాలిఫై కావడం గమనార్హం.

* ప్రమాదకరంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు
ప్రభుత్వ ఉపాధ్యాయులు టెట్ ఫలితాల్లో ఘోరమైన ఫలితాలు సాధించారు. మొత్తం 23,623 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు పరీక్షలు రాశారు. కేవలం 8,809 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. ఏకంగా 14,814 మంది ఉపాధ్యాయులు ఫెయిల్ కావడం ఆందోళనకు గురిచేస్తోంది. గత ఏడాది ప్రభుత్వ ఉపాధ్యాయుల ఉత్తీర్ణత శాతం 50 కాగా.. ఈ ఏడాది 37.29 శాతానికి పడిపోయింది. ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి పేపర్ 1 లో 52. 57%, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ లో 38.27%, సోషల్ లో అత్యంత దారుణంగా 24.05 శాతం మంది మాత్రమే పాస్ అయ్యారు. అయితే సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం.. విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులు 2028 ఆగస్టు నాటికి కచ్చితంగా పరీక్ష పాస్ కావాల్సి ఉంటుంది. లేకుంటే మాత్రం ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్ట్ ను వదులుకోవాల్సి ఉంటుంది.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు