Homeలైఫ్ స్టైల్బరువు తగ్గాలన్నా.. గ్లాసీ స్కిన్ కావాలన్నా.. రోజు ఈ పండు తింటే చాలు!

బరువు తగ్గాలన్నా.. గ్లాసీ స్కిన్ కావాలన్నా.. రోజు ఈ పండు తింటే చాలు!

క్రైమ్ మిర్రర్, హెల్త్ న్యూస్:- ఆరోగ్యానికి మేలు చేసే పండ్లలో దానిమ్మకు ప్రత్యేక స్థానం ఉంది. ఎర్రగా మెరిసే ఈ పండును చాలామంది రుచి కోసం తింటారు. కానీ ఇందులో ఉండే పోషకాలు శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తాయి. విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే దానిమ్మను రోజూ తింటే ఆరోగ్యంతో పాటు చర్మం కూడా కాంతివంతంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఎన్నో అద్భుతాలు..!

దానిమ్మలో ఉండే శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తగ్గిస్తాయి. ఇవి చర్మ కణాలు దెబ్బతినకుండా కాపాడటంతో పాటు ముందస్తు వృద్ధాప్య లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. దీంతో స్కిన్ గ్లో పెరిగి ముఖం తాజాగా కనిపిస్తుంది. అందుకే చాలా మంది దానిమ్మను “నేచురల్ బ్యూటీ ఫ్రూట్”గా కూడా పిలుస్తారు.బరువు తగ్గాలనుకునే వారికి కూడా దానిమ్మ మంచి ఆప్షన్. ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల త్వరగా ఆకలి వేయదు. దీంతో అధికంగా తినే అలవాటు తగ్గుతుంది. అలాగే తక్కువ కేలరీలు ఉండటం వల్ల వెయిట్ లాస్ డైట్‌లో కూడా దీన్ని చేర్చుకోవచ్చు.

గుండె ఆరో్యానికి కూడా దానిమ్మ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడుతుంది. రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేసి హైబీపీ సమస్యను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది. దానిమ్మలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. కీళ్ల నొప్పులు, అలసట వంటి సమస్యలను తగ్గించడంలో ఇది సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
జీర్ణక్రియను మెరుగుపరచడంలో కూడా దానిమ్మ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది. గుట్ హెల్త్‌ను మెరుగుపరచి జీర్ణవ్యవస్థ సరిగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది.

ఇటీవల జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం దానిమ్మ మెదడు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడటంతో పాటు వయసు పెరిగే కొద్దీ వచ్చే మతిమరుపు సమస్యలను తగ్గించడంలో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు.అంతేకాదు.. దానిమ్మలో ఉండే కొన్ని ప్రత్యేక పోషకాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను తగ్గించే గుణం కలిగి ఉన్నాయని పరిశోధనలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా ప్రొస్టేట్, బ్రెస్ట్ క్యాన్సర్‌లపై ఇది సానుకూల ప్రభావం చూపుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. రోజూ ఒక దానిమ్మ తింటే ఆరోగ్యంతో పాటు అందం కూడా మీ సొంతమవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు