Homeలైఫ్ స్టైల్వేసవిలో ఇదే బెస్ట్ కూలింగ్ ఫుడ్.. కానీ ఇలా తీసుకుంటేనే ప్రయోజనం!

వేసవిలో ఇదే బెస్ట్ కూలింగ్ ఫుడ్.. కానీ ఇలా తీసుకుంటేనే ప్రయోజనం!

క్రైమ్ మిర్రర్, హెల్త్ న్యూస్:-వేసవి కాలంలో శరీరానికి చల్లదనం ఇచ్చే ఆహారాలు, పానీయాల వినియోగం పెరుగుతోంది. అలాంటి సంప్రదాయ సహజ పదార్థాల్లో గోండ్ కతీరా కూడా ఒకటి. శర్బత్‌లు, కూలింగ్ డ్రింక్స్, మిఠాయిల్లో దీన్ని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచడంలో, హైడ్రేషన్ మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది. అయితే దీనిని సరైన సమయంలో, సరైన మోతాదులో తీసుకోవడం చాలా ముఖ్యమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

ఎప్పుడు తీసుకుంటే మంచిది?

నిపుణుల ప్రకారం గోండ్ కతీరాను ఉదయం ఖాళీ కడుపుతో లేదా మధ్యాహ్నానికి ముందు తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా వేసవిలో రోజులో తొందరగా తీసుకుంటే శరీరానికి చల్లదనం ఎక్కువగా అందుతుంది. రాత్రి సమయంలో లేదా అధిక మోతాదులో తీసుకుంటే జీర్ణక్రియ మందగించే అవకాశం ఉందని చెబుతున్నారు.

ఇలా నానబెట్టాలి

గోండ్ కతీరాను నీటిలో నానబెట్టిన తర్వాత అది జెల్‌లా మారుతుంది. ఇదే దాని ప్రధాన ప్రత్యేకత. ఒకటి నుంచి రెండు టీ స్పూన్ల గోండ్ కతీరాను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం తయారైన జెల్‌ను ఒకటి నుంచి రెండు టేబుల్ స్పూన్ల మోతాదులో తీసుకోవచ్చు. దీన్ని పాలు, శర్బత్ లేదా ఇతర ద్రవాలతో కలిపి తీసుకోవడం మంచిది.

పొడిగా తినొద్దు

గోండ్ కతీరాను నేరుగా పొడిగా తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది కడుపులో అసౌకర్యం కలిగించే అవకాశం ఉంటుంది. సరైన విధంగా నానబెట్టి మాత్రమే తీసుకోవాలి.

ఎవరు జాగ్రత్తగా తీసుకోవాలి?

కడుపు ఉబ్బరం, గ్యాస్, ఐబీఎస్ వంటి సమస్యలు ఉన్నవారు గోండ్ కతీరాను పరిమితంగా తీసుకోవాలి. అలాగే తక్కువ బీపీ ఉన్నవారు, జీర్ణక్రియ నెమ్మదిగా ఉండేవారు, ఇప్పటికే అధిక ఫైబర్ ఆహారం తీసుకునేవారు కూడా జాగ్రత్తగా వాడాలని సూచిస్తున్నారు.

మందులతో పాటు తీసుకోవద్దు

వ్యాయామానికి ముందు, భారీ భోజనం చేసిన వెంటనే లేదా మందులతో పాటు గోండ్ కతీరా తీసుకోవద్దని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మందులు తీసుకునే సమయానికి కనీసం రెండు నుంచి మూడు గంటల గ్యాప్ ఉండాలి.

సరైన మోతాదే ముఖ్యం

సరైన మోతాదులో, సరైన సమయంలో తీసుకుంటే గోండ్ కతీరా వేసవిలో శరీరానికి చల్లదనం అందించే మంచి సహజ పదార్థంగా ఉపయోగపడుతుంది. అయితే వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తీసుకోవడం అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు