క్రైమ్ మిర్రర్ : ప్రముఖ నటుడు నానా పటేకర్ మృతి సినీ పరిశ్రమలో తీవ్ర విషాదాన్ని నింపింది. 75 ఏళ్ల వయసులో ఆయన గురువారం కన్నుమూశారు. నానా పటేకర్ మృతిపై సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ప్రియమైన మిత్రుడిని కోల్పోవడం బాధాకరంగా ఉందంటూ భావోద్వేగ నివాళి అర్పించారు.
గోవాలోని తన నివాసంలో గురువారం తెల్లవారుజామున నానా పటేకర్ గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. అయితే వైద్యులు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉదయం 5:20 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. నానా పటేకర్ మృతి వార్త తెలుసుకున్న రజనీకాంత్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా తన స్పందనను పంచుకున్నారు. “నా ప్రియమైన మిత్రుడు నానాజీ ఇక లేరనే విషయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. ఆయన కుటుంబ సభ్యులకు, ఆప్తులకు నా ప్రగాఢ సానుభూతి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అంటూ రజనీకాంత్ భావోద్వేగంగా పేర్కొన్నారు.
‘కాలా’లో కలిసి నటించిన ఇద్దరు దిగ్గజాలు
రజనీకాంత్, నానా పటేకర్ కలిసి 2018లో తెరకెక్కిన ‘కాలా’ సినిమాలో నటించారు. పా. రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటించగా.. నానా పటేకర్ ప్రతినాయకుడు ‘హరి దాదా’ పాత్రను పోషించారు. వీరిద్దరి మధ్య సాగే సన్నివేశాలు సినిమాలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముఖ్యంగా రజనీకాంత్‌కు దీటుగా నానా పటేకర్ తనదైన శైలిలో నటించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
నానా పటేకర్ మరణంతో ‘కాలా’ చిత్రానికి సంబంధించిన జ్ఞాపకాలను అభిమానులు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడు, రచయితగా కూడా తన ప్రతిభను చాటుకున్న నానా పటేకర్ మరణం భారతీయ సినీ పరిశ్రమకు తీరని లోటుగా పలువురు సినీ ప్రముఖులు పేర్కొంటున్నారు.
also read : మైనర్ బాలిక దారుణ హత్య.. తల నరికి అడవిలో పడేసిన ప్రియుడు
