-
రెండో రోజు కూడా విజయవంతం
-
అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ ఆకట్టుకున్న వైనం
-
వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో మెరిసిన లోకేష్
-
టిడిపి క్యాడర్లో ఫుల్ జోష్
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ హైబ్రిడ్ మహానాడు ముగిసింది. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఈ మహానాడు విజయవంతంగా పూర్తి చేయగలిగింది తెలుగుదేశం పార్టీ. రాష్ట్రవ్యాప్తంగా 1800కు పైగా క్లస్టర్లలో మహానాడు కొనసాగింది. అమరావతి లోని టిడిపి కేంద్ర కార్యాలయంలో పరిమిత ప్రతినిధులతో జరిగిన ఈ మహానాడు ను.. 175 నియోజకవర్గాల పరిధిలో అన్ని క్లస్టర్లకు అనుసంధానం చేస్తూ మహానాడు ను నిర్వహించారు.
అధినేత చంద్రబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్, టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పార్టీ శ్రేణులకు దిశ నిర్దేశం చేశారు. దాదాపు 65 మంది వక్తలు, 20 తీర్మానాలు ప్రవేశపెట్టి చర్చించారు. ఈసారి మహిళా ధీమ్ తో కొనసాగింది మహానాడు. అయితే ఎన్నెన్నో అనుమానాలను పటాపంచలు చేస్తూ.. హైబ్రిడ్ మహానాడు విజయవంతం అయ్యింది.
శ్రేణుల్లో ఆనందం..
మహానాడు విజయవంతంతో తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఆనందం తొణికిసలాడింది. ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు గాను దిశా నిర్దేశం చేసింది మహానాడు. ఇదే స్ఫూర్తితో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే ఏకపక్షంగా విజయం ఖాయమని టిడిపి క్యాడర్ భావిస్తోంది. సాధారణంగా మహానాడు అంటే ఏదో ఒక జిల్లాకు, ఒక నగరానికి పరిమితం అయ్యేది. భౌతికంగా మహానాడు జరిగేది.
వేలాది వాహనాలు, లక్షలాదిమంది పార్టీ కార్యకర్తలతో ఒక సందడి వాతావరణం ఉండేది. అతిధి మర్యాదలు, పసందైన వంటకాలతో మహానాడు ఒక ప్రత్యేకం. కానీ ఈసారి మాత్రం అందుకు భిన్నం. పూర్తి డిజిటల్ విధానంలో సాగిన మహానాడు రెండు రోజులపాటు టిడిపి శ్రేణులను అలరించింది. అనుమానాలను పటాపంచలు చేస్తూ విజయవంతం అయింది.
మహిళలకు 33% టిక్కెట్లు..
ప్రధానంగా ఈసారి స్త్రీ శక్తి ధీమ్ తో కొనసాగింది హైబ్రిడ్ మహానాడు. మహిళా నేతలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అదే స్ఫూర్తితో మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో.. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుతో పని లేకుండా.. వచ్చే ఎన్నికల్లో 33% టిక్కెట్లు మహిళల కే కేటాయిస్తామని ప్రకటించారు.
ఇటీవలే నారా లోకేష్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులైన సంగతి తెలిసిందే. తొలిసారిగా ఆ హోదాలో చేసిన ప్రకటన మహిళలను ఎంతగానో ఆకట్టుకుంది. జాతీయ స్థాయిలో సైతం హైలెట్ గా నిలిచింది. తెలుగుదేశం మహానాడు సక్సెస్ తో అటు టిడిపి క్యాడర్ లో ఫుల్ జోష్ నెలకొంది. విపక్షాలు ఒక రకమైన ఆత్మరక్షణలోకి వెళ్లాయి.