Homeఅంతర్జాతీయంకమల్ హాసన్ కు కష్టాలు...!

కమల్ హాసన్ కు కష్టాలు…!

  • ఎంఎన్ఎం పార్టీ కార్యాలయం వద్ద అభ్యర్థుల ఆందోళనలు

  • డీఎంకేకు పార్టీని పణంగా పెట్టారని ఆరోపణలు

క్రైమ్ మిర్రర్, ఎలక్షన్ డెస్క్ : తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ప్రత్యేకమే. అక్కడ సినీ, రాజకీయ రంగాలను వేరువేరుగా చూడలేం. అంతలా ఆ రెండు రంగాలు ఇమిడిపోయాయి. సినీ రంగానికి చెందిన ప్రముఖులు ద్రవిడ రాజకీయాన్ని శాసించారు. అయితే అలా రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయిన వారు కొందరే. తాజాగా విజయ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అయితే విజయ్ కంటే ముందుగా వచ్చిన కమల్ హాసన్ మాత్రం పొలిటికల్ డిజాస్టర్ గా మిగిలారు. అయితే తాజాగా ఆయన తన పార్టీని డీఎంకేకు పణంగా పెట్టడం సొంత పార్టీ శ్రేణులే విమర్శిస్తున్నారు. పార్టీ కార్యాలయాల వద్ద ఆందోళనకు దిగుతున్నారు.

దరఖాస్తు రుసుము వసూలు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో కమల్ హాసన్ తన ఎంఎన్ఎం తరుపున పోటీ చేసే అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఒక్కొక్కరి నుంచి 50 వేల రూపాయల చొప్పున వసూలు చేశారు. ఇలా 60 మంది నుంచి 30 లక్షల రూపాయల వరకు వసూలు చేశారు. ప్రస్తుతం డీఎంకేకు మద్దతు తెలిపిన దృష్ట్యా.. ఆ కూటమిలో 20 కి పైగా పార్టీలకు సీట్లు సర్దుబాటు చేసిన దృష్ట్యా.. తమ పార్టీకి కూడా సీట్లు కేటాయించాలని కమల్ హాసన్ కోరారు. అయితే కమల్ ఎం ఎన్ ఎం పార్టీ తరఫున కాకుండా.. డీఎంకే తరఫున కొన్ని టిక్కెట్లు సర్దుబాటు చేస్తానని స్టాలిన్ చెప్పుకొచ్చారు. అందుకు కమల్ హాసన్ అంగీకరించలేదు. దీంతో వీలుపడకపోవడంతో కమల్ డీఎంకేకు మద్దతు ప్రకటించారు. తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయరని తేల్చి చెప్పారు. అయితే పోటీ చేయనప్పుడు దరఖాస్తులు ఎందుకు తీసుకున్నారని.. కొంత మొత్తం డిపాజిట్ ఎందుకు సేకరించారని అభ్యర్థులు ప్రశ్నించడం ప్రారంభించారు. అయితే అది పార్టీకి ఇచ్చిన విరాళంగా పేర్కొనాలని కమల్ చెబుతున్నారట. దీంతో వారంతా పార్టీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగుతున్నారు. దీంతో కమల్ హాసన్ పరువు గంగపాలు అవుతోంది.

గత ఎన్నికల్లో ఓటమి..
గత ఎన్నికల్లోనే కమల్ హాసన్ ఎం ఎన్ ఎం పార్టీ బరిలో దిగింది. ఆ పార్టీ తరఫున ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవలేదు. దీంతో మరో మాట మాట్లాడక డీఎంకేకు మద్దతు తెలిపారు కమల్ హాసన్. అందుకుగాను కమల్ హాసన్ కు రాజ్యసభ పదవి దక్కింది. ఇప్పుడు దానికి ప్రయోజనం చేకూర్చేందుకు ఈ ఎన్నికల్లో డీఎంకేకు బాహటంగా మద్దతు ప్రకటించారు కమల్. అటువంటప్పుడు తమ వద్ద దరఖాస్తులు ఎందుకు తీసుకోవాలని.. డబ్బులు ఎందుకు వసూలు చేయాలని ఆ పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే కమల్ హాసన్ తో పోల్చుకుంటే ఉమ్మడి ఏపీలో చిరంజీవి నయం. ఎందుకంటే అప్పట్లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. ఉమ్మడి రాష్ట్రంలోనే 18 సీట్లు సాధించారు. అటు తరువాతనే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు చిరంజీవి. అందుకు ప్రతిగా రాజ్యసభ పదవి అందుకున్నారు. కనక రాష్ట్ర మంత్రి అయ్యారు. కానీ ఇప్పుడు కమల్ అలా కాదు. తన పార్టీని డీఎంకేకు పణంగా పెట్టారు. ఇది తీవ్ర విమర్శలకు గురిచేస్తోంది.

ఇవి కూడా చదవండి ….

  1. Telangana: ఆధ్యాత్మిక రాజకీయం…!

  2. Revanth Master Plan: త్రిశూల్ వ్యూహం.. బల్దియా పై రేవంత్ స్పెషల్ గురి!

  3. Cabinet Expansion: మంత్రివర్గ విస్తరణకు బ్రేక్.. ఆశావహులపై సీఎం రేవంత్ నీళ్లు!

  4. Telangana: కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులు…!

  5. ఆ మత మార్పిడిల వెనుక జగన్…?!

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు