Homeఆంధ్ర ప్రదేశ్తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కష్టాలు..!

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన కష్టాలు..!

క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఇంధన కొరత తీవ్రంగా ఏర్పడింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది రోజుల నుంచి పెట్రోల్ బంకులు ఒక్కొక్కటిగా మూత పడిపోతున్నాయి. పెట్రోల్ మరియు డీజిల్ ఉపయోగిస్తున్నటువంటి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా ఇంధనం సరఫరా మెరుగుపడినప్పటికీ చాలామంది భయంతో వెంట వెంటనే ఎక్కువ మోతాదులో కొనుగోలు చేయడంతో నిమిషాల్లోనే ఆయిల్ ట్యాంకర్లు కూడా ఖాళీ అవుతున్నాయి అని పెట్రోల్ బంకు యాజమానులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణ, విజయనగరం మరియు శ్రీకాకుళం జిల్లాల్లో విపరీతంగా డీజిల్ కొరత నెలకొంది. పెట్రోల్ మరియు డీజిల్ సరఫరా జరుగుతున్న పెట్రోల్ బంకుల్లో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. ఆయా పెట్రోల్ బంకుల్లో ఇప్పటికే నో స్టాక్ బోర్డులు పెట్టడంతో ప్రజల్లో భయం మరింత నెలకొంది. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కూడా ఇదేవిధంగా పెట్రోల్ బంకులు మూతపడ్డాయి. పెట్రోల్ తో జరిగే పనులన్నీ కూడా ఆగిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పెట్రోల్ మరియు డీజిల్ కోసం వాహనదారులైతే రాత్రి పగలు అని తేడా లేకుండా పెట్రోల్ బంకుల వద్ద క్యూలైన్లో నించుంటున్నారు. వెంటనే రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ విషయంపై చర్చలు చేస్తున్నప్పటికీ ప్రతి ఒక్కరిలోనూ పానిక్ బయింగ్ నెలకొంది. దీంతో క్షణాల్లోనే ఇందనం అనేది ఖాళీ అయిపోతుంది.

Odisha Bank Incident: అక్క అస్థిపంజరంతో బ్యాంకుకు వెళ్లిన తమ్ముడు.. అయ్యో.. మరీ ఇంత ఘోరమా?

Indian Airlines: ఇలాగైతే విమానాలు నడపలేం, కేంద్రానికి ఎయిర్‌లైన్స్ లేఖ!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు