Homeతెలంగాణసుస్థిర ప్రగతికి దోహదపడేలా బడ్జెట్‌

సుస్థిర ప్రగతికి దోహదపడేలా బడ్జెట్‌

 

  • విక‌సిత్ భార‌త్ -2047 ల‌క్ష్యం
  • కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి

హైద‌రాబాద్, క్రైం మిర్ర‌ర్ః

ప్రజలు ఆశిస్తున్న సుస్థిర ప్రగతికి దోహదపడేలా బడ్జెట్‌ ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఎన్నికల కోసం కాకుండా వికసిత్‌ భారత్‌-2047 ల‌క్ష్యం కోసం పెట్టిన బ‌డ్జెట్ అన్నారు.

హైద‌రాబాద్‌లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు.ఉచితాలు ప్రవేశ పెట్టడం కోసమే బడ్జెట్ ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు ప్రజల్లో తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మండిప‌డ్డారు.

వీబీ జీ రామ్‌ జీ పథకానికి 9శాతానికి అధిక నిధులు…
కాంగ్రెస్ ప్ర‌భుత్వం వీబీ జీ రామ్‌ జీ పథకాన్ని నిర్వీర్యం చేశారంటూ పెద్ద ఎత్తున్న‌త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని కాని ఆ పథకానికి బడ్జెట్‌ లో 9శాతం అధిక నిధులు కేటాయించారని చెప్పారు.

వస్త్ర ఉత్పత్తి పరిశ్రమలకు సైతం పెద్ద‌పీఠ‌వేశార‌ని తెలిపారు.. ప్రతి జిల్లాకూ బాలికల వసతి గృహం రాబోతున్నట్లు కిషన్‌రెడ్డి చెప్పారు.
అదేవిధంగా ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద తెలంగాణకు 4.30లక్షల ఇళ్లు కేటాయించామన్నారు.

మేడారంకు రూ3.70కోట్ల కేటాయింపు….

రానున్న రోజుల్లో హైదరాబాద్‌ రైల్వే హబ్‌ కాబోతుందన్నారు. ఆసియాలోనే అతిపెద్ద వ‌న‌దేవ‌త‌లై స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ‌ల‌ మేడారం జాతరకు కేంద్రం 3.70 కోట్లు కేటాయించిందన్నారు.

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్ పార్టీల నిర్ల‌క్ష్య‌పు రాజ‌కీయాల వ‌ల్ల‌నే సింగరేణి భ్రష్టు పట్టిందని ఆరోపించారు.

బీఆర్ఎస్ హ‌యాంలో సింగరేణిని ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీగా కేసీఆర్‌ మార్చుకున్నారని, ఇప్పుడున్న కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌గా మార్చుకుందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

ఏదేమైన ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌కు అనుకూలంగానే బ‌డ్జేట్ కేటాయించిన‌ట్లు తెలిపారు.

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు