ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: వెనుజువెలాలను వరుస భూకంపాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. రెండు జంట భూ కంపాలతో అల్లాడిపోతున్న తరుణంలో మళ్లీ తాజాగా4.6 నుంచి 5.1 తీవ్రతతో మరోసారి భూప్రకంపనలు సంభవించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురై ఇళ్లను వదిలి వీధుల్లోనే ఆశ్రయం పొందారు. గత వారం సంభవించిన భారీ భూకంపం వల్ల దెబ్బతిన్న భవనాల వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read:Nabha Natesh: నటిగా మంచి సంతృప్తిని ఇచ్చాయి.. నభా నటేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
సరిగ్గా మూడు రోజుల క్రితం వెనెజువెలా ఉత్తర-మధ్య ప్రాంతాన్ని 39 సెకన్ల వ్యవధిలో 7.2, 7.5 తీవ్రతతో కూడిన రెండు అత్యంత శక్తివంతమైన జంట భూకంపాలు వణికించిన సంగతి తెలిసిందే.కోలుకోకముందే వరుస ప్రకంపనలు: అంతకుముందు సంభవించిన మొదటి భూకంపంలో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడంతో స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతిలో ఉన్నారు. ఆ నష్టం నుంచి కోలుకోకముందే వరుస ప్రకంపనలు వస్తుండటంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రస్తుత భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
Also Read:Kayadu Lohar: క్యూట్ బ్యూటీకి క్రేజీ ఆఫర్.. ఏకంగా సూర్య మూవీలో ఛాన్స్!