-
తమిళనాడులో టీవీకే గెలుపులో కీలక పాత్ర
-
వచ్చే ఎన్నికల్లో లక్ష్యంగా చేసుకొని జగన్ కీలక నిర్ణయం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ ధైర్యం కూడా తీసుకొని గట్టి పోరాటాలే చేయడం ప్రారంభించింది. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేస్తోంది. అయినా సరే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీకి ఘోర పరాజయం ఎదురైంది. తొలుత మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోయిన ఆ పార్టీ పరిషత్ ఎన్నికల్లో కూడా చేతులెత్తేసింది. పంచాయితీ ఎన్నికల్లో సైతం కోటని హవా చాటే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో గెలవడం అంత ఈజీ కాదు అని తేలిపోయింది. అందుకే జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు పన్నుతున్నారు. అందులో భాగంగా ఎన్నికల వ్యూహకర్తను నియమించేందుకు సిద్ధపడుతున్నారు. తాజాగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కపిల్ సాహు రాజకీయ వ్యూహ కర్తగా నియమితులు అవుతారన్న ప్రచారం పొలిటికల్ వర్గాల్లో బలంగా సాగుతోంది.
ఐ ప్యాక్ కు సేవలు…
గతంలో ఐప్యాక్ లో పనిచేసేవారు కపిల్ సాహు. ఇటీవల జరిగిన తమిళనాడు టీవీ కె పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించారు. విజయ్ ను కరూర్ తొక్కిసలాట, వ్యక్తిగత వివాదాలు చుట్టుముట్టినా సరే పక్కా స్ట్రాటజీతో టీవీ కె పార్టీని, విజయ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లారని చెబుతున్నారు. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ ఘనవిజయం సాధించిన తర్వాత కపిల్ సాహు పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఏపీలోనూ ప్రముఖంగా వినిపిస్తోంది. త్వరలో జగన్ పాదయాత్ర, 2029 ఎన్నికల లక్ష్యంగా చేసుకొని వ్యూహాలు రూపొందించేందుకు కపిల్ సాహును రాజకీయ వ్యూహకర్తగా నియమిస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ అధికారికంగా ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు.
అప్పట్లో భారీ విజయం…
2019లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా పనిచేసే భారీ విజయాన్ని అందించారు. 2024 ఎన్నికల్లో ఐప్యాక్ నుంచి వచ్చిన ఋషిరాజ్ సింగ్ ఆ బాధ్యతలను తీసుకున్నారు. అయినా సరే వైసీపీకి ఓటమి తప్పలేదు. అందుకే ఇప్పుడు బలమైన వ్యూహకర్తను నియమించుకొని 2029 ఎన్నికలలో గెలవాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్రణాళికగా తెలుస్తోంది. కపిల్ సాహు కు స్ట్రాటజిస్ట్‌గా దాదాపు 10 ఏళ్ల అనుభవం ఉంది. ఆయన సొంతంగా ఓ సంస్థను ఏర్పాటు చేసుకున్నట్లు చెబుతున్నారు. 2019లో సిక్కిం ఎన్నికలు, 2024లో ఆఫ్ విస్తరణ, కాంగ్రెస్ పార్టీకి ప్రచార కార్యక్రమాల్లో పనిచేసిన అనుభవం ఉంది. తమిళనాడు లో విజయ్ గెలుపులో కూడా కీలక పాత్ర పోషించడంతో ఆయన వైపు జగన్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
