Homeక్రైమ్అచ్చంపేట హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

అచ్చంపేట హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

క్రైమ్ మిర్రర్ : హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారి 765పై ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అచ్చంపేట మండలం చెన్నారం, హాదీపూర్ గ్రామాల మధ్య జరిగిన ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. స్థానికుల సమాచారం ప్రకారం.. బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులను వేగంగా వచ్చిన టవేరా వాహనం (TS08 Q 1667) బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు బైక్‌పై ఉన్న ఇద్దరూ రోడ్డుపై పడిపోవడంతో తీవ్ర గాయాలై ఘటనాస్థలంలోనే మృతి చెందినట్లు తెలుస్తోంది.

మృతులను బిజినపల్లి మండలం వెలుగొండ గ్రామానికి చెందిన వంశీ, చేగుంట గ్రామానికి చెందిన మహేష్‌గా గుర్తించారు. వీరిద్దరూ ఉప్పునుంతల మండలం రాయిచెడు గ్రామంలో భవన నిర్మాణ మేస్త్రీలుగా పనిచేస్తున్నారు. రోజువారీ పనులు ముగించుకుని తిరిగి తమ స్వగ్రామాలకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. చేతికి అందివచ్చిన యువకులు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది.

ప్రమాద సమాచారం అందుకున్న అచ్చంపేట ఎస్సై నరేష్ పోలీసు సిబ్బందితో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద వివరాలను పరిశీలించి, రహదారిపై నిలిచిపోయిన వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించారు. అనంతరం మృతదేహాలను అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి కారణమైన టవేరా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఒకే ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడంతో వెలుగొండ, చేగుంట గ్రామాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు.
also read: ఏపీకి మరో తుపాను ముప్పు.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు! ఢిల్లీ పర్యటన రద్దు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు