క్రైమ్ మిర్రర్ : జగిత్యాల జిల్లాలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగినట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. లిఫ్ట్ ఇస్తానని చెప్పి బాలికను బైక్పై ఎక్కించుకున్న వ్యక్తి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. కోరుట్ల పట్టణంలోని నక్కలగుట్ట ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక స్థానికంగా ఓ షాపింగ్ మాల్లో పనిచేస్తోంది. బుధవారం విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా అదే ప్రాంతానికి చెందిన వెంకట్రావు బైక్పై ఆమె వద్దకు వచ్చాడు. తాను కూడా ఇంటికే వెళ్తున్నానని చెప్పి లిఫ్ట్ ఇస్తానంటూ బాలికను బైక్పై ఎక్కించుకున్నట్లు తెలిపారు.
అనంతరం బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాలిక నుంచి వివరాలు సేకరించారు. బాలిక మైనర్ కావడంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికానున్నాయి.
also read : బస్సు హైడ్రాలిక్ డోర్లో బాలుడి తల ఇరుక్కుని మృతి.. సీసీటీవీపై అనుమానాలు
