Homeక్రైమ్హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు మృతి..

హెలికాప్టర్ ప్రమాదంలో ఏడుగురు మృతి..

క్రైమ్ మిర్రర్ : కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. సాంబూరు కౌంటీ ప్రాంతంలో సఫారీ టూర్‌కు వెళ్తున్న హెలికాప్టర్ కొండ ప్రాంతంలో కూలిపోవడంతో పైలట్ సహా ఏడుగురు మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు అమెరికా పౌరులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. లేడీ లోరీ సంస్థకు చెందిన యూరోకాప్టర్ హెలికాప్టర్ లోయిసాబా కన్సర్వెన్సీ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రతికూల వాతావరణ పరిస్థితులే ప్రమాదానికి కారణమై ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. మృతుల్లో ప్రముఖ అమెరికన్ జర్నలిస్ట్, టెలిముండో ఛానెళ్ల అధ్యక్షుడు, జనరల్ మేనేజర్‌గా పనిచేసిన 55 ఏళ్ల జోస్ అల్బెర్టో సువారెజ్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఈక్వెడార్ జాతీయ నిఘా విభాగం డైరెక్టర్ మిచెల్ సెన్సీ-కంట్యూగీ, ఆయన భార్య స్టెఫానీ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ప్రమాదానికి అసలు కారణం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని అధికారులు తెలిపారు. కెన్యా సివిల్ ఏవియేషన్ అథారిటీ దర్యాప్తు ప్రారంభించినట్లు వెల్లడించారు.
also read : లిఫ్ట్ ఇస్తానని చెప్పి మైనర్ బాలికపై అఘాయిత్యం.. యువకుడిపై కేసు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు