హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మల జోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ యాడ్ షూటింగ్ సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమగా మారి, ఆ తర్వాత వివాహానికి దారితీసింది. అయితే అనుష్క శర్మను పెళ్లి చేసుకున్న తర్వాత విరాట్ కోహ్లీకి టాలీవుడ్‌కు చెందిన ఓ హీరోయిన్‌తో బంధుత్వం ఏర్పడింది. దీంతో ఆ హీరోయిన్ ఎవరనే విషయం అప్పట్లో సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు.. చిలసౌ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రుహానీ శర్మ. హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఆమె ఆ తర్వాత హిట్, డర్టీ హరి, సైంధవ్ వంటి చిత్రాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే రుహానీ శర్మకు అనుష్క శర్మతో కుటుంబ బంధం ఉందనే విషయం చాలామందికి తెలియదు. అనుష్కకు రుహానీ శర్మ కజిన్ అవుతారని సమాచారం.
Also Read:చోడవరంలో దారుణం.. కుటుంబ కలహాలతో భర్త హత్య?
అనుష్క శర్మను విరాట్ కోహ్లీ వివాహం చేసుకున్న తర్వాత రుహానీ శర్మ కూడా ఆయన కుటుంబంలో భాగమయ్యారు. ఈ కారణంగా విరాట్ కోహ్లీకి రుహానీ శర్మ మరదలి వరుస అవుతారు. ఈ విషయాన్ని రుహానీ శర్మ స్వయంగా ఓ సందర్భంలో వెల్లడించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఓ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో విరాట్ కోహ్లీ తనకు బావ వరుస అవుతారని ఆమె చెప్పినట్లు సమాచారం. రుహానీ శర్మ చిలసౌ సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చారు. తొలి సినిమాతోనే తన నటనతో ఆకట్టుకున్న ఆమె అనంతరం హిట్, డర్టీ హరి, సైంధవ్ వంటి సినిమాల్లో నటించారు. విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ టాలీవుడ్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ప్రస్తుతం సినిమాల పరంగా కొంత గ్యాప్ వచ్చినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఆమె యాక్టివ్‌గా ఉంటున్నారు.
Also Read:భాగ్యశ్రీ బోర్సేకు మరో బిగ్ ఆఫర్.. నాని ‘బ్లడీ రోమియో’లో హీరోయిన్‌గా ఛాన్స్?
తరచూ తన ఫొటోలు, వ్యక్తిగత అప్‌డేట్స్‌ను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఆమె షేర్ చేసే గ్లామరస్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. సినిమాల కంటే ఎక్కువగా సోషల్ మీడియా ద్వారా కూడా అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. మరోవైపు విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలతో ఉన్న కుటుంబ బంధం కారణంగా రుహానీ శర్మ పేరు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చర్చకు వస్తూనే ఉంటుంది.
