రాజమండ్రిలో కాపు నేత చేగొండి హరిరామజోగయ్య కుటుంబానికి సంబంధించిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హరిరామజోగయ్య కుమారుడిపై టీడీపీ మాజీ డిప్యూటీ మేయర్ కుమారుడు వాసిరెడ్డి బాబీ, ఆయన అనుచరులు దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు అందింది.
అపార్ట్మెంట్లోకి వెళ్లిన వాసిరెడ్డి బాబీ, ఆయన వెంట ఉన్నవారు హరిరామజోగయ్య కుమారుడు, కోడలు, మనవడితో పాటు అక్కడ పనిచేస్తున్న గుమస్తాపై దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. ఈ ఘటనలో బాధితులపై విచక్షణారహితంగా దాడి చేశారని ఆరోపణలు వచ్చాయి.
అపార్ట్మెంట్లోని ఓ మహిళతో వాచ్మెన్ అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణల నేపథ్యంలో ఫిర్యాదు చేయించడం ఈ వివాదానికి కారణంగా తెలుస్తోంది. ఈ వ్యవహారంపై ఇరు వర్గాల మధ్య వివాదం తలెత్తి, చివరకు దాడి వరకు వెళ్లినట్లు సమాచారం.
ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అసలు గొడవకు దారితీసిన పరిస్థితులు, దాడిలో ఎవరి పాత్ర ఎంతవరకు ఉందనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టాల్సి ఉంది. పూర్తి వివరాలు అధికారిక దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.
also read: ‘గీతాంజలి’ రీ- రిలీజ్.. నవంబర్ 13న మళ్లీ థియేటర్లలోకి
