హైదరాబాద్, క్రైమ్‌మిర్రర్:సంక్రాంతి 2027 బాక్సాఫీస్ రేసు ఇప్పటినుంచే ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా సాయి దుర్గా తేజ్ నటిస్తున్న భారీ ప్రాజెక్ట్ ఈ పోటీలోకి అధికారికంగా ఎంట్రీ ఇచ్చింది. రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తయింది. దాదాపు రెండేళ్లుగా ఈ సినిమా కోసం టీమ్ పనిచేస్తుండగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను హనుమాన్ నిర్మాతలు చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం యాక్షన్ సన్నివేశాలు, ప్రొడక్షన్ డిజైన్, పీరియాడిక్ సెట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో సాయి దుర్గా తేజ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించారు. రక్తంతో తడిసిన యాక్షన్ అవతార్‌లో ఆయన కనిపించడం సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.
Also Read:దువ్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో మహిళ మృతదేహం.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు
ముఖ్యంగా ఈ చిత్రాన్ని 2027 జనవరి 12న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో సంక్రాంతి బరిలోకి సాయి తేజ్ కూడా అడుగుపెట్టినట్లైంది. అయితే ఈ రిలీజ్ డేట్ కారణంగా మెగా అభిమానుల్లో మరో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. సంక్రాంతి సమయంలో చిరంజీవి నటిస్తున్న మెగా 158 కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాకు కదిరి కాకాజీ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో రజనీకాంత్ ధర్మన్, అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కలిసి నటిస్తున్న సినిమా కూడా సంక్రాంతి రేసులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Also Read:చోడవరంలో దారుణం.. కుటుంబ కలహాలతో భర్త హత్య?
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే సాయి దుర్గా తేజ్ తన సొంత మేనమామ చిరంజీవి సినిమాతోనే బాక్సాఫీస్ వద్ద పోటీ పడాల్సి రావచ్చు. మెగా కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు ఒకే పండుగ సీజన్‌లో తమ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఈ క్లాష్‌పై భారీగా ఆసక్తి నెలకొనే అవకాశం ఉంది. అయితే సంక్రాంతి రిలీజ్ డేట్లు చాలా ముందుగానే ఖరారైనప్పటికీ చివరి నిమిషంలో మారే అవకాశాలు ఉంటాయి. షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, థియేటర్ల లభ్యత వంటి అంశాల ఆధారంగా సినిమాల విడుదల తేదీల్లో మార్పులు జరగొచ్చు. ప్రస్తుతం మాత్రం సాయి దుర్గా తేజ్ సినిమా జనవరి 12న విడుదలకు సిద్ధమవుతూ సంక్రాంతి రేసును మరింత ఆసక్తికరంగా మార్చింది
