మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో విషాద ఘటన చోటుచేసుకుంది. చిన్నపల్లి అంకిత (25) అనే వివాహిత ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందింది. భర్తతో తరచూ గొడవలు జరుగుతుండటంతో ఆమె కొంతకాలంగా మనస్తాపానికి గురైనట్లు సమాచారం.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అంకిత తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
కాగా, అంకిత దంపతుల కుమార్తె కొన్నేళ్ల క్రితమే మృతి చెందినట్లు తెలిసింది. కుటుంబ కలహాలే ఆమె ఆత్మహత్యకు కారణమా? అనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
also read: ఏలూరులో మహిళ అదృశ్యం కేసులో ట్విస్ట్.. బంగారం కోసం గోదావరిలోకి తోసేసిన ఆటోడ్రైవర్!
