Homeక్రైమ్విషాదాంతం.. పురుగుల మందు తిని చెరువులో దూకిన ప్రేమ జంట

విషాదాంతం.. పురుగుల మందు తిని చెరువులో దూకిన ప్రేమ జంట

బాపట్ల జిల్లా మార్టూరు మండలం కోనంకి గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ప్రేమించుకున్న యువకుడు, బాలిక ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.

గుంటూరు జిల్లా కాకుమాను ప్రాంతానికి చెందిన లావు విఘ్నేష్ (22), 15 ఏళ్ల బాలిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. మంగళవారం ఉదయం ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. అనంతరం బుధవారం ఉదయం మార్టూరు మండలం కోనంకి గ్రామంలోని చెరువు వద్దకు చేరుకున్నారు.

అక్కడి నుంచి తాము ఆత్మహత్య చేసుకోబోతున్నట్లు బంధువులకు సెల్‌ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. అనంతరం ఇద్దరూ ఎలుకల మందు తీసుకుని చెరువులోకి దూకినట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న స్థానికులు చెరువు వద్దకు చేరుకుని మృతదేహాలను గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీసి, ఘటనపై విచారణ చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

also read: డబ్బుల కోసం అమ్మమ్మను హత్య చేసి పరారైన యువకుడు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు