Homeక్రైమ్డిపో నుంచి కొత్త ఆర్టీసీ బస్సు చోరీ.. టైర్ పంక్చర్ కావడంతో మధ్యలోనే వదిలేసిన దొంగలు!

డిపో నుంచి కొత్త ఆర్టీసీ బస్సు చోరీ.. టైర్ పంక్చర్ కావడంతో మధ్యలోనే వదిలేసిన దొంగలు!

ఆర్టీసీ డిపోలో పార్క్ చేసిన కొత్త బస్సు చోరీకి గురైన ఘటన మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో వెలుగుచూసింది. దొంగలు ఏకంగా బస్సును స్టార్ట్ చేసి రోడ్డుపైకి తీసుకెళ్లారు. అయితే కొంతదూరం వెళ్లిన తర్వాత టైర్ పంక్చర్ కావడంతో దానిని అక్కడే వదిలేసి పరారయ్యారు. ఈ ఘటన ఆర్టీసీ అధికారులను ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.

మహారాష్ట్ర స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్‌ (MSRTC)కు చెందిన కొత్త బస్సును జమ్నేర్ ఎస్టీ డిపోలో నిలిపి ఉంచారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో కొందరు వ్యక్తులు డిపోలోకి ప్రవేశించి, అక్కడ పార్క్ చేసిన బస్సును చోరీ చేసినట్లు అధికారులు గుర్తించారు.

బస్సును తీసుకుని డిపో నుంచి బయటకు వెళ్లిన దొంగలు కొంతదూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. అయితే మార్గమధ్యలో బస్సు టైర్ పంక్చర్ కావడంతో ప్రయాణాన్ని కొనసాగించలేకపోయారు. దీంతో ఓ గ్రామ సమీపంలో బస్సును వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

మరుసటి రోజు డిపోలో బస్సు కనిపించకపోవడంతో అధికారులు విషయాన్ని గుర్తించారు. వెంటనే సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. కొందరు వ్యక్తులు బస్సును డిపో నుంచి బయటకు తీసుకెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

ఇదిలా ఉండగా, డిపో నుంచి కొత్త బస్సును దొంగలు అంత సులభంగా బయటకు తీసుకెళ్లడం ఇప్పుడు భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. డిపోలో భద్రతా సిబ్బంది, పర్యవేక్షణ ఉన్నప్పటికీ దొంగలు బస్సుతో బయటకు ఎలా వెళ్లగలిగారనే అంశంపై అధికారులు దృష్టి సారించారు. ఈ ఘటనపై అంతర్గతంగా కూడా విచారణ చేపట్టినట్లు సమాచారం.

బస్సు చోరీకి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ ఘటనపై ఆసక్తి నెలకొంది. పోలీసులు నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు.

also read: రాణి ముఖర్జీకి అరుదైన గౌరవం.. ఆస్ట్రేలియా యూనివర్సిటీ నుంచి ప్రతిష్ఠాత్మక డాక్టరేట్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు