Homeతెలంగాణతెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ సహకరించడం లేదు: ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర...

తెలంగాణ అభివృద్ధికి ప్రధాని మోదీ సహకరించడం లేదు: ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు!

క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాష్ట్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపించారు. ఢిల్లీలో జరిగిన ఓ కాంక్లేవ్‌లో పాల్గొన్న ఆయన కేంద్ర తీరుపై విమర్శలు గుప్పించారు. ఆర్‌ఆర్ఆర్ (RRR) టెండర్లు మరియు మెట్రో రైలు విస్తరణ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల విషయంలో ప్రధాని మోదీ సహకరించడం లేదని ఆయన స్పష్టం చేశారు.

LPUలో తీవ్ర హింసాత్మక నిరసనలు, విధ్వంసం.. ప్రాణభయంతో ఇళ్లకు తిరుగుముఖం పడుతున్న తెలుగు విద్యార్థులు!

నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజకీయాలకు అతీతంగా పూర్తి సహకారం అందించారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం దేశంలో పరిస్థితి ‘నార్త్ వర్సెస్ సౌత్’ కాకుండా, ‘గుజరాత్ వర్సెస్ దేశం’ అన్నట్లుగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల ఓట్లను తొలగించడానికే ఎస్‌ఐఆర్ (SIR) తీసుకొచ్చారని విమర్శించిన ఆయన, ‘ఎస్‌ఐఆర్ గో బ్యాక్’ అంటూ దేశమంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రాష్ట్రాల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా పోరాడతామని సీఎం రేవంత్ తేల్చిచెప్పారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం జాతీయ రాజకీయాల్లోనూ పెను సంచలనంగా మారాయి.

ఫార్ములా-ఈ కేసులో కీలక పరిణామం: కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తు చేయాలని కోర్టు ఆదేశం!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు