క్రైమ్ మిర్రర్,తెలంగాణ:- తెలంగాణ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫార్ములా-ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి కేటీఆర్‌తో పాటు మరో ముగ్గురి పాస్‌పోర్ట్‌లను తాత్కాలికంగా జప్తు చేయాలని ఏసీబీ అధికారులు ఇటీవల కోర్టును ఆశ్రయించారు.
ఈ మేరకు ఏసీబీ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న కోర్టు, హైదరాబాద్ రీజనల్ పాస్‌పోర్ట్ ఆఫీసును ఆదేశిస్తూ అధికారికంగా లేఖ రాసింది. సాధారణంగా ఏదైనా క్రిమినల్ కేసు నమోదైనప్పుడు, నిందితులు విదేశాలకు పారిపోకుండా లేదా వెళ్లకుండా అడ్డుకునేందుకు ఈ విధంగా పాస్‌పోర్ట్‌లను ఇంపౌండ్ చేయడం జరుగుతుంది. ఈ పరిణామం బీఆర్ఎస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
150 ఏళ్ల వేడుకలు.. ఒంగోలులో ఘనంగా 150 గిత్తలతో భారీ ప్రదర్శన, ప్రత్యేక పోటీలు!
