పంజాబ్‌లోని ప్రఖ్యాత లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) క్యాంపస్‌లో చెలరేగిన హింసాత్మక నిరసనలు తీవ్ర కలకలం సృష్టించాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడి హాస్టళ్లలో చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని తమ స్వస్థలాలకు ఇళ్లకు చేరుకుంటున్నారు. క్యాంపస్‌లోని హాస్టళ్లలో ప్రస్తుతం ఎలాంటి సురక్షిత పరిస్థితులు లేవని, నిరసనల పేరుతో బయటి వ్యక్తులు యూనివర్సిటీలోకి చొరబడ్డారన్న వార్తలు తమ కుటుంబాలను తీవ్ర ఆందోళనకు గురిచేశాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫార్ములా-ఈ కేసులో కీలక పరిణామం: కేటీఆర్ పాస్‌పోర్ట్ జప్తు చేయాలని కోర్టు ఆదేశం!
ఈ ఘర్షణల సమయంలో కొందరు వ్యక్తులు ఆయుధాలు సైతం ఉపయోగించడంతో క్యాంపస్‌లో భయానక వాతావరణం నెలకొంది. ఈ హింసాకాండలో యూనివర్సిటీ పరిధిలోని చాలా బ్లాక్‌లు ధ్వంసమైనట్లు విద్యార్థులు చెప్తున్నారు. విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని యూనివర్సిటీ యాజమాన్యం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే రాబోయే 10 రోజుల పాటు తరగతులను (క్లాసులను) ఎల్పీయూ (LPU) పూర్తిగా సస్పెండ్ చేసినట్లు ప్రకటించింది. ఈ పరిణామాలతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
150 ఏళ్ల వేడుకలు.. ఒంగోలులో ఘనంగా 150 గిత్తలతో భారీ ప్రదర్శన, ప్రత్యేక పోటీలు!
