Homeతెలంగాణఒకే సారి రెండు చోట్ల‌ఎన్నిక‌లు...! గెలిస్తే తెలంగాణ మ‌ళ్లీ హ‌స్తానిదే...?

ఒకే సారి రెండు చోట్ల‌ఎన్నిక‌లు…! గెలిస్తే తెలంగాణ మ‌ళ్లీ హ‌స్తానిదే…?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: ఖైరతాబాద్ ఎన్నికల కంటే ముందుగానే గ్రేటర్ ఎన్నికలు నిర్వహిస్తారా? రేవంత్ సర్కార్ అంత సాహసం చేస్తుందా? అనేది ఇప్పుడు అందరిలో ఉన్న అనుమానం. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు సమీపిస్తోంది. కానీ ఈ రాష్ట్రానికి కీలకమైన గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల విషయంలో మాత్రం కాంగ్రెస్ ఎందుకు భయపడుతోంది. హైదరాబాదును మూడు మున్సిపల్ కార్పొరేషన్లుగా విభజించారు. జిహెచ్ఎంసి, సైబరాబాద్, మల్కాజిగిరిగా విభజించి.. సుమారు 300 డివిజన్ల పునర్విభజన చేపట్టారు. అంతవరకు సాహసమైన అడుగులు వేసింది కాంగ్రెస్. కానీ ఎన్నికల నిర్వహణకు వచ్చేసరికి మాత్రం దాగుడుమూతలు ఆడుతోంది. పాలనా సంస్కరణలు, అభివృద్ధి కార్యక్రమాలపై రోజుకో ప్రకటన చేస్తున్న సీఎం రేవంత్.. భాగ్యనగరంలో ప్రజా తీర్పును ఎదుర్కోవడానికి ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు అనేది తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట.

కోర్టు కేసులు పరిష్కరించడం…

గ్రేటర్ ఎన్నికల విషయంలో కాంగ్రెస్ ఒక వాదనను తెరపైకి తెచ్చింది. అవే కోర్టు కేసులు. మూడు కార్పొరేషన్ల ఏర్పాటు, డివిజన్ల పునర్విభజన జీవోలపై హైకోర్టులో పిటిషన్లు, న్యాయపరమైన చిక్కులు ఉన్నాయని సాకు చెబుతోంది. కానీ ప్రభుత్వం చిత్తశుద్ధితో సంకల్పిస్తే ఈ న్యాయవివాదాలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించడం పెద్ద విషయం కాదు. సమగ్ర కౌంటర్లు దాఖలు చేసి… కోర్టు ఆమోదం పొంది ఎన్నికల ప్రక్రియను పట్టాలెక్కించే పూర్తి అధికారం, యంత్రాంగం ప్రభుత్వం చేతిలోనే ఉన్నాయి. న్యాయపరమైన అంశాల వెనుక దాక్కోవడం కాకుండా.. చట్టబద్ధమైన అడ్డంకులు తొలగించుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్లడమే ఒక ధైర్యవంతమైన నాయకత్వానికి నిదర్శనం. గతంలో ఎదురైన అడ్డంకులను అధిగమించి ముందుకు సాగిన అనుభవాలు ఉండగా.. కార్పొరేషన్ ఎన్నికల విషయంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిస్తేజంగా వ్యవహరిస్తుందని భావన ప్రజల్లో బలపడుతోంది.

ఊపు కోసం తప్పదు…

దానం నాగేందర్ పై అనర్హత వేటుతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. ఇటువంటి సమయంలో గ్రేటర్ రాజకీయాలు పతాక స్థాయికి చేరాయి. రాజధాని నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గ ఉప ఎన్నిక ముంచుకొస్తున్న తరుణంలో.. కార్పొరేషన్ల ఎన్నికలకు వెళ్లడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి రాజకీయంగా భారీ ఊపును, సానుకూల వాతావరణాన్ని సృష్టించే సువర్ణ అవకాశమే. హైదరాబాద్లో పూర్వ వైభవం సాధించాలన్న భారత రాష్ట్ర సమితి ఆశలను, దూకుడు మీద ఉన్న బిజెపిని ఏకకాలంలో ఆత్మరక్షణలో నెట్టాలంటే గ్రేటర్ ఎన్నికలు సరైన అస్త్రం. నగర ఓటర్లను సమీకరించి ఉప ఎన్నికలతో పాటు కార్పొరేషన్ ఎన్నికలకు వెళితే.. రాజధానిపై పూర్తి పట్టు సాధించినట్టు అవుతుంది. అది రాష్ట్రవ్యాప్తంగా ప్రభావం చూపుతుంది.

ఆ అనుమానం తోనే…

సీఎం రేవంత్ తో పాటు కాంగ్రెస్ పార్టీకి అనుమానము చూపులు ఎంత మాత్రం సహేతుకం కాదు. నగరవాసులు తిరస్కరిస్తారన్న భావన వారికి ఉన్నట్టు ఉంది. కానీ ఒక అజెండాగా తీసుకుని.. అసెంబ్లీతోపాటు సార్వత్రిక ఎన్నికల ముంగిట గ్రేటర్ రిస్క్ చేస్తే వచ్చే ఫలితం బట్టి తన పాలనా తీరును, తన రాజకీయ దృక్పథాన్ని రేవంత్ మార్చుకునేందుకు అవకాశం కలుగుతుంది. కానీ రేవంత్ మాత్రం ఆ సాహసానికి దిగడం లేదు. ఒకవేళ ఆ సాహసానికి దిగి సక్సెస్ అయితే తెలంగాణలో రేవంత్ ను ఆపేవారు లేరు. అయితే ఆ రిస్క్ తీసుకునేందుకు మాత్రం రేవంత్ ముందుకు రావడం లేదు. అయితే ఈ రోజు కాకుంటే రేపైనా గ్రేటర్ ఎన్నికలకు వెళ్లి.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. అందుకే ఇప్పుడే తాడోపేడో తేల్చుకుంటే చాలా మంచిది.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. ఢిల్లీ-ఎన్సీఆర్‌లో వరుస అత్యాచారాలపై సుప్రీంకోర్టు సుమోటో.. అధికారులపై కీలక వ్యాఖ్యలు
  2. ఏపీలో హోటళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల మెరుపు దాడులు.. 25 సంస్థలు మూసివేత
  3. ఆస్ట్రేలియాలో ఒకే ఫ్రేమ్‌లో ముగ్గురు నేతలు…!మల్లారెడ్డి భేటీపై తెలంగాణలో కొత్త చర్చ…
  4. సీఎం రేవంత్‌కు కేటీఆర్ ప్రశ్నల వర్షం.. హామీల అమలుపై తేదీలు చెప్పాలని బహిరంగ లేఖ

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు