Homeతెలంగాణఖైర‌తాబాద్ ఉప ఎన్నిక‌ల్లో క‌విత పార్టీ పోటి...!ఆ మూడు పార్టీల‌పై గ‌ట్టి ప్ర‌బావం...

ఖైర‌తాబాద్ ఉప ఎన్నిక‌ల్లో క‌విత పార్టీ పోటి…!ఆ మూడు పార్టీల‌పై గ‌ట్టి ప్ర‌బావం…

  • కవిత ఆలోచన వేరు..

  • ఖైరతాబాద్ ఉప ఎన్నికల్లో పక్కా లెక్కతోనే..

  • గెలవకపోయినా.. వారి గెలుపోటముల డిసైడ్ చేసేలా..

 

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: ఖైరతాబాద్ విషయంలో అసలు కవిత ఆలోచన ఏంటి? ఆమె ఎందుకు ఉప ఎన్నికల్లో పోటీ చేయించాలని చూస్తున్నారు? తమ పార్టీ అభ్యర్థిని ఎందుకు రంగంలోకి దించాలని భావిస్తున్నారు? పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే ఆసక్తికర చర్చ నడుస్తోంది. దానం నాగేందర్ వ్యవహారంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వచ్చింది. అయితే ఈ ఎన్నికల్లో తాను తమ పార్టీ అభ్యర్థిని రంగంలోకి దించుతానని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవితా ప్రకటించారు. అయితే ఆమె పార్టీ అభ్యర్థి ఎంతవరకు ప్రభావం చూపుతారు అనేది పక్కన పెడితే.. ఇతర పార్టీల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఎందుకంటే అక్కడ త్రిముఖ పోటీ ఖాయం. ప్రధానంగా కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ ల మధ్య గట్టి పోటీ ఉంటుంది. నాలుగో శక్తిగా సరికొత్త వేదికతో ప్రత్యక్ష ఎన్నికల్లోకి దూకడం ద్వారా తన పార్టీ ఉనికి చాటుకునేలా చేస్తున్నారు కవిత. ఏదైనా రాజకీయ ప్రకంపనలు.. తన పార్టీ ద్వారా తెరలేపి ఆలోచన చేస్తున్నారు.

పార్టీ నిర్మాణం జరగకుండానే…

కవిత పార్టీ ఏర్పాటు జరిగి నెలలు గడుస్తోంది. ఇంకా పార్టీ ద్వితీయ శ్రేణి నిర్మాణం జరగలేదు. ఇటువంటి సమయంలో ఉప ఎన్నిక అనేది ఆ పార్టీకి గొప్ప సాహసం. అయినా సరే ఈ ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థిని కవిత దింపుతున్నారు అంటే భారీ వ్యూహమే ఉంటుంది. ఆమె అజెండా రాష్ట్ర రాజకీయాల్లో తమకంటూ ఒక ప్రత్యేక ఓటు బ్యాంకు ఉందని నిరూపించుకోవడమే అని స్పష్టమవుతోంది. కొత్తగా పెట్టిన పార్టీకి క్షేత్రస్థాయిలో ఉనికిని చాటాలన్న.. భవిష్యత్తు ఎన్నికల నాటికి కేడర్ను సమాయత్తం చేయాలన్నా.. ఇలాంటి బైపాస్ సరైన మైదానాలు. కేవలం ప్రెస్ మీట్లకు పరిమితం కాకుండా.. స్వయంగా రోడ్లిక్కి ప్రచారం చేసి గౌరవప్రదమైన సంఖ్యలో ఓట్లు రాబెట్టుకోగలిగితే.. తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఒక అనివార్యమైన ప్రత్యామ్నాయ శక్తిగా నిలబడవచ్చు అనేది కవిత ఆలోచన. అందుకే ఈ ఉప ఎన్నికను ఆమె ఏదో మొక్కుబడిగా కాకుండా.. సీరియస్ అంశంగా తీసుకుని ముందుకు సాగుతున్నారు.

అనేక సమీకరణలు…

తెలంగాణలోనే అతిపెద్ద నియోజకవర్గం ఖైరతాబాద్. అక్కడ భౌగోళిక, రాజకీయ సమీకరణలు భిన్నంగా ఉంటాయి. అందుకే అక్కడ పోటీ మరింత రసవత్తరంగా మారే అవకాశాలు ఉన్నాయి. నియోజకవర్గంలో బస్తీలు, మధ్యతరగతి కాలనీలు, విద్యావంతులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఈ క్రమంలో స్థానికంగా పట్టుండి, వ్యక్తిగత పరపతి కలిగిన బలమైన అభ్యర్థిని బరిలోదించగలిగితే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ప్రత్యేకించి మహిళా ఓటర్ల పై కవిత ప్రభావం ఎక్కువ. దానికి కారణం తెలంగాణ జాగృతి. మహిళా సాధికారిక అంశాలను ఆమె సమర్థవంతంగా ప్రచారంలోకి తీసుకెళ్లగలిగితే.. మహిళల ఓటు బ్యాంకును కొంతవరకు సొంతం చేసుకోవచ్చు. పైగా నగర మహిళలు కొంచెం అడ్వాన్స్ గా ఆలోచిస్తారు. తమ ప్రయోజనాలకు పెద్ద పీట వేసే వారికి ఛాన్స్ ఇస్తారు. అందుకే కవిత పార్టీ అభ్యర్థి మహిళా ఓటు బ్యాంకు పై ప్రభావం చూపగలరు. మిగతా ప్రధాన పార్టీల ఓటు బ్యాంకును గండి కొట్టగలరు.

వారి ఆశలు తలకిందులు…

కవిత ఎంట్రీ తో ఖైరతాబాద్ లో రాజకీయ సమీకరణలు మారే అవకాశం ఉంది. ప్రధాన పార్టీల గెలుపు ఓటముల మార్జిన్లు తలకిందులయ్యే అవకాశం కూడా ఉంది. సాంప్రదాయకంగా ఉన్న గులాబీ పార్టీ ఓట్లతో పాటు అధికార కాంగ్రెస్ వైఫల్యాలపై అసంతృప్తితో ఉన్న తట్టస్థ ఓట్లపై కవిత ప్రభావం చూపగలిగితే మాత్రం.. ఆ పార్టీకి గౌరవప్రదమైన ఓట్లు లభించే అవకాశం ఉంది. ప్రధాన పార్టీల జయాపజయాలను శాసించగలిగితే మాత్రం తెలంగాణ సమాజంలో కవిత పార్టీ కోసం ఆలోచన మొదలయ్యే ఛాన్స్ ఉంటుంది. అదే తక్కువ ఓట్లు లభించినా మంచి పోరాట పటిమ ప్రదర్శిస్తున్నారు అన్న పేరు సొంతం చేసుకోవచ్చు. ఎలా వెళ్లిన కవితకు ఈ ప్రయోగం లాభం చేకూర్చేదే.

 

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి తివారీ ఆత్మహత్య.. అసలు కారణమేంటీ ?
  2.  విషాదం.. బ్రెడ్, జామ్ తిన్న వ్యక్తి మృతి, ఇద్దరు కుమార్తెలకు అస్వస్థత
  3. మణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. అపార్ట్‌మెంట్‌లో చోరీ
  4. శ్రీకాకుళం ఎంపీగా తమ్మినేని…?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు