Homeఆంధ్ర ప్రదేశ్ఖాళీ అవుతున్న వైసీపీ...! పార్టీలో టెన్ష‌న్‌...

ఖాళీ అవుతున్న వైసీపీ…! పార్టీలో టెన్ష‌న్‌…

  • టిడిపిలోకి క్యూ కడుతున్న ద్వితీయ శ్రేణి నాయకులు

  • విజయనగరంలో గట్టిగానే చిన్న శ్రీను ఎఫెక్ట్

 

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: విజయనగరంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా షాక్ లు తగులుతున్నాయి. మొన్ననే ఆ పార్టీకి చెందిన జిల్లా పరిషత్ చైర్మన్ చిన్న శ్రీను రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. బొత్స ఫ్యామిలీలో కీలక వ్యక్తిగా, రాజకీయ శక్తిగా ఎదిగారు చిన్న శ్రీను. బొత్స ఫ్యామిలీ నుంచి వేరుపడి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలనే కుదిపేసాయి. అయితే చిన్న శ్రీనును పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఆయనతో ఏ ఒక్క వైసీపీ నేత వెళ్ళరు అంటూ చెప్పుకొచ్చారు వైయస్సార్ కాంగ్రెస్ అగ్ర నేతలు. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ద్వితీయ శ్రేణి క్యాడర్ అంతా విజయనగరంలో ఖాళీ అవుతుండడం ఇప్పుడు ఆందోళన కలిగించే విషయం.

ద్వితీయ శ్రేణి నాయకత్వం లో మార్పు…

ఏ పార్టీకైనా ద్వితీయ శ్రేణి నాయకత్వమే ముఖ్యం. వారు పటిష్టంగా ఉంటేనే ఆ పార్టీ అధికారంలోకి రాగలదు. అయితే ఇప్పుడు విజయనగరం జిల్లాలో ఏకంగా మాజీ జడ్పిటిసిలు వైసీపీకి గుడ్ బై చెబుతున్నారు. చిన్న శ్రీను నేతృత్వంలో తెలుగుదేశం పార్టీకి జై కొడుతున్నారు. వాస్తవానికి 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం జిల్లాలో ప్రభంజనం సృష్టించింది. ఏకపక్షంగా అన్ని మండలాల జడ్పిటిసి స్థానాలతో పాటు జిల్లా పరిషత్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు ఆ మాజీ జడ్పిటిసి లంతా మూకుమ్మడిగా తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బ.

చిన్న శ్రీను కీలకం...

బొత్స రాష్ట్ర నాయకుడిగా ఎదగడం వెనుక కుటుంబ పాత్ర ఉంది. ప్రధానంగా ఆయన మేనల్లుడు చిన్న శ్రీను పాత్ర విశేషం. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ను, పార్టీని ఒంటి చేత్తో నడిపించారు. అందుకే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది. మరోవైపు చిన్న శ్రీను సైతం టిడిపిలో స్వేచ్ఛగా పనిచేయగలుగుతున్నారు. మొత్తం వైసీపీ క్యాడర్ను టిడిపి వైపు ఒక క్రమ పద్ధతిలో తిప్పుతున్నారు. ఇది ఎంత మాత్రం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి మింగుడు పడని విషయం. అయితే మున్ముందు మరిన్ని పరిణామాలు విజయనగరం జిల్లాలో చోటు చేసుకునే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో.. గతంలో తెలుగుదేశం పార్టీకి ఎదురైన పరిణామాలే.. ఇప్పుడు వైసీపీకి ఎదురు కావడం ఖాయమని విశ్లేషణలు వస్తున్నాయి. చూడాలి మరి ఏం జరుగుతుందో..

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. తెలంగాణాలో చంద్రబాబు…! పదేపదే ప్రస్తావిస్తున్న గులాబీ పార్టీ నేతలు…
  2. టాయిలెట్‌లో విషవాయువు పీల్చి ఇద్దరు యువకులు మృతి
  3. నాగర్‌కర్నూలులో దారుణం.. కొడుకులతో కలిసి భర్తను హత్య చేసిన భార్య…
  4. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిధి తివారీ ఆత్మహత్య.. అసలు కారణమేంటీ ?

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు